విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి, కార్మిక సంఘాలు మార్చి 5, శుక్రవారం నాడు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ రాష్ట్ర బంద్ కు ఇప్పటికే టీడీపీ, వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ సహా పలు ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు, వ్యాపార సంఘాలు మద్ధతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు తలపెట్టిన బంద్ కు ఏపీ ప్రభుత్వం సంఘీభావం ప్రకటించింది. ఏపీ రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని గురువారం మీడియాతో మాట్లాడుతూ రేపటి బంద్ కు ప్రభుత్వం సంఘీభావం తెలుపుతోందని చెప్పారు. అలాగే బంద్ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆర్టీసీ బస్సులు నిలిపివేయనున్నామని, ఒంటిగంట తరవాత యధావిధిగా బస్సులు నడుస్తాయని, ఆర్టీసీ సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తారని వెల్లడించారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేయకుండా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని కేంద్రప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు కేంద్రం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ, ఉక్కు పరిశ్రమ ఉద్యోగ సంఘాలు సహా ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నాయి. అలాగే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కుపరిశ్రమ ఆర్చ్ వద్ద ఉక్కుపరిశ్రమ పరిరక్షణ పోరాట సమితి సభ్యులు రీలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ