వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీ-ఫామ్ పత్రాలు అందజేసిన సీఎం వైఎస్‌ జగన్‌

2021 AP MLC Elections, Andhra MLC polls, AP CM YS Jagan, AP CM YS Jagan Handover B Forms to 6 YSRCP MLC Candidates, AP MLC Elections, AP MLC Elections 2021, B Forms to 6 YSRCP MLC Candidates, Mango News, MLC Elections, YS Jagan, YS Jagan Handover B Forms to 6 YSRCP MLC Candidates, Ysr congress party mlc candidates taken b form, YSRCP MLC Candidates

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన జరగనున్న ఆరు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇటీవలే తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆరు స్థానాలకు గానూ చల్లా భగీరథరెడ్డి, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, సి.రామచంద్రయ్య, షేక్ మహ్మద్ ఇక్బాల్, దువ్వాడ శ్రీనివాస్,‌ కరీమున్నీసా లను పార్టీ తరుపున ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో ఆరుగురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు గురువారం నాడు క్యాంప్‌ కార్యాలయంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని కలిశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్ వారికీ బీ-ఫామ్‌ పత్రాలను అందజేశారు. ఈ ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులు గురువారం నాడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

ముందుగా ఆంధ్రప్రదేశ్ లో గుండుమల తిప్పే స్వామి, గుమ్మిడి సంధ్యారాణి, వట్టికూటి వీర వెంకన్న చౌదరి, షేక్ మహ్మద్ ఇక్బాల్, పిల్లి సుభాష్ చంద్రబోస్ (రాజీనామా) ల యొక్క ఎమ్మెల్సీ పదవీకాలం మార్చి 29, 2021 తో పూర్తి కానుంది. అలాగే చల్లా రామకృష్ణారెడ్డి మృతితో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్ ప్రకటించింది. ఫిబ్రవరి 25 న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవగా, మార్చి 15 వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజున ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 17 =