మోడీ కేబినెట్‌లోకి వెళ్లాలనే ప్లాన్

Pawan Kalyan, Pawan is contesting from 2 seats, Modi's cabinet, CM Jagan, YCP, Chandrababu, TDP, Janasena, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections, Mango News Telugu, Mango News
Pawan Kalyan,Pawan is contesting from 2 seats, Modi's cabinet,CM Jagan, YCP,Chandrababu, TDP, Janasena

టీడీపీ అధినేత చంద్రబాబు పోటీ చేయబోయే స్థానం తెలిసింది. నారా లోకేష్ బరిలో దిగే నియోజకవర్గం తెలిసింది. కూటమిలో భాగమయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచుంటారనే విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. ఒక్కోసారి ఒక్కో  పేరు వినిపిస్తుంది తప్ప అసలు మాటేంటి అన్నది పవన్ ప్రకటించడం లేదు. కానీ పవన్ గురించి ఓ న్యూస్ మాత్రం వైరల్ అవుతోంది. పవన్  అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో కూడా  పోటీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా అదే కన్షమ్ అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.  ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ పిఠాపురం నుంచి పోటీచేస్తారని..  లోక్‌సభ ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీ బరిలో నిలవబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. పవన్   భీమవరం, గాజువాక స్థానాల్లో ఏదో ఒక చోట బరిలో దిగాలని ముందుగా  అనుకున్నా కూడా .. జనసేన శ్రేణులు,చంద్రబాబు ఇచ్చిన సూచనతో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా.. అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఆల్మోస్ట్ ఖరారు అయినట్లు జనసేన వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఒకవేళ పవన్ ఎంపీగా గెలిస్తే.. మూడోసారి అధికారం తమదే అన్న ధీమాతో ఉన్న బీజేపీ పెద్దలు కేంద్ర కేబినెట్లోకి తీసుకోవడానికి చూస్తున్నారన్న న్యూస్ వినిపిస్తోంది. ఇదే కనుక  పవన్  కేంద్రమంత్రి అవుతారంటూ ప్రచారం జరుగుతోంది. నిజానికి పవన్  అనకాపల్లి నుంచి బరిలో ఉండటంపై పెద్ద వ్యూహమే ఉందట. ప్రజారాజ్యం పార్టీ ఉన్న సమయంలో అనకాపల్లి నుంచి అల్లు అరవింద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.అయితే ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణాలతో  అనకాపల్లిలో దాదాపు 90% ఉన్న కాపు ఓట్ బ్యాంక్  మొత్తాన్ని జనసేన ఖాతాలో వేసుకోవడానికి పవన్  ఇక్కడి నుంచి పోటీ చేయటానికి ప్రయత్నిస్తోన్నట్లు తెలుస్తోంది. అనకాపల్లిలో పోటీచేస్తే పవన్ గెలుపునకు తెలుగు దేశం పార్టీ కూడా సహాయ సహకారాలు అందిస్తుందని.. దీనివల్ల పవన్ గెలవడం గ్యారంటీ అన్న లెక్కల్లో జనసైనికులు ఉన్నారు

మరోవైపు ఇప్పటికే సీట్లకు సర్దుబాటుకు సంబంధించి టీడీపీ, జనసేన మధ్య క్లారిటీ రావడంతో.. రెండు పార్టీలు అధినేతలు ప్రజల్లో భారీ బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు. తాడేపల్లిగూడెంలో జెండా సభ, మంగళగిరిలో జయహో బీసీ సభలతో అధికార వైసీపీపై  చంద్రబాబు, పవన్ విరుచుకుపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ జనాలకు కావాల్సిన క్లారిటీ ఇచ్చి మరీ ఈ ఎన్నికలలో వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ రెండు సభలతో టీడీపీ,జనసేన కేడర్‌లోనూ సరికొత్త జోష్ కనిపిస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి.  2014 ఎన్నికలలో  వైసీపీ ఓటమి ఖాయమని కూటమి  నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్   భీమవరంతో పాటు గాజువాకలో రెండు చోట్ల పోటీ చేశారు. కానీ పవన్ రెండు చోట్లా ఓటమి పాలయ్యారు. ఓడిపోయామని దూరంగా కూర్చోకుండా ఏ సమస్య వచ్చినా తానున్నంటూ పవన్ ముందుకు రావడంతో జనాల్లో పశ్చాత్తాపం మొదలయింది.  దీనికి తోడు రోజురోజుకు వైసీపీ నేతల్లో ముఖ్యమంత్రి నుంచి ముఖ్య నేత వరకూ చేస్తున్న అవినీతి అక్రమాలు బయటపడటంతో ప్రత్యామ్నాయ పార్టీ కోసం ఏపీ వాసులు చూస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. దీంతో పవన్ ఎక్కడ నిలబడినా గెలిపించే ఆలోచనలో ఏపీ ప్రజలు ఉన్నట్లు తెలుస్తోంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × five =