ఏపీలో డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై త్వరలో నిర్ణయం?

Andhra Pradesh, Andhra Pradesh Degree Exams, Andhra Pradesh News, Andhra Pradesh PG Exams, AP Degree Exams, AP Govt Decides to Cancel Degree Exams, AP Govt Decides to Cancel PG Exams, AP PG Exams, AP PG/UG Exams, Corona Effect

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇటీవలే పదోతరగతి పరీక్షలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2019-20 సంవత్సరానికి గానూ డిగ్రీ, పీజీ సహా అన్ని వృత్తి విద్యా కోర్సుల యొక్క చివరి సెమిస్టర్‌ పరీక్షలపై కూడా త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం. కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వీసీలు, రిజిస్ట్రార్లు, ఇతర ఉన్నతాధికారులతో ఈ అంశంపై ‌సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్లి పరీక్షల నిర్వహణపై కీలక ప్రకటన వెలువరించనున్నట్టు సమాచారం.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu