టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు

Andhra Pradesh, Andhra Pradesh News, AP High Court, AP High Court Grants Bail to Tekkali TDP MLA Atchannaidu, Atchannaidu, Atchannaidu Bail, Bail to Tekkali TDP MLA Atchannaidu, TDP MLA Atchannaidu, TDP MLA Atchannaidu Bail, TDP MLA Atchannaidu Got Bail, Tekkali, Tekkali TDP MLA Atchannaidu

మాజీ మంత్రి, టెక్కలి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కు ఏపీ హైకోర్టు ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపి, పలు షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. ముందుగా ఈఎస్‌ఐ కేసులో జూన్ 12 న అచ్చెన్నాయుడును అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) అధికారులు అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్ కు తరలించగా అనారోగ్య కారణాల దృష్ట్యా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు గుంటూరులోని రమేశ్‌ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందారు. ఇటీవలే అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ప్రస్తుతం ఎన్‌ఆర్‌ఐ కోవిడ్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu