జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం: క్లియర్‌ టైటిల్‌తో రిజిస్ట్రేషన్లు చేయాలని సీఎం జగన్‌ ఆదేశాలు

Chief Minister of Andhra Pradesh, Jagananna Sampoorna Gruha Hakku, Jagananna Sampoorna Gruha Hakku Scheme, Jagananna Sampoorna Gruha Hakku scheme news, Jagananna Sampoorna Gruha Hakku scheme updates, Mango News, Meeting To Review Jagananna Sampoorna Gruha Hakku Scheme, Sampoorna Gruha Hakku Scheme, ys jagan mohan reddy, YS Jagan Mohan Reddy Holds Meeting To Review Jagananna Sampoorna Gruha Hakku, YS Jagan Mohan Reddy Holds Meeting To Review Jagananna Sampoorna Gruha Hakku Scheme, YS Jagan Mohan Reddy To Review Jagananna Sampoorna Gruha Hakku Scheme

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్ధిదారులకు క్లియర్‌ టైటిల్‌తో రిజిస్ట్రేషన్‌ చేయాలని, అందుకోసం తగిన విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి జాప్యం లేకుండా అప్రూవల్స్‌ ఇవ్వాలని, క్షేత్రస్థాయిలో ఎంక్వైరీలు కూడా నిర్దేశించుకున్న సమయంలోగా పూర్తిచేయాలన్నారు. ఆస్తులపై పూర్తి హక్కులు దఖలు పడతాయని లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని, అలాగే పథకం అమలుపై దిగువస్థాయి అధికారులకు, లబ్ధిదారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టాలని సీఎం సూచించారు.

ఇప్పటివరకూ 52 లక్షలమంది ఈ పథకం కింద నమోదు కాగా, 45.63 లక్షల లబ్ధిదారుదాల డేటాను ఇప్పటికే సచివాలయాలకు అధికారులు ట్యాగ్‌ చేసినట్టు తెలిపారు. క్షేత్రస్థాయిలో ఎంక్వైరీలు పూర్తిచేస్తు, ఎప్పటికప్పుడు దరఖాస్తులను పరిశీలించి వారికి అప్రూవల్స్‌ ఇస్తున్నామని, మరో 10 రోజుల్లో పూర్తిస్థాయిలో అప్రూవల్స్‌ ఇస్తామని అధికారులు తెలిపారు. ఇక రిజిస్ట్రేషన్లకోసం తగినన్ని స్టాంపు పేపర్లను తెప్పించుకున్నామని, 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామని అధికారులు సీఎంకు వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ జరుగుతుందని, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌ ను నవంబర్‌ 20 నుంచి ప్రారంభించి, డిసెంబర్‌ 15 వరకూ నిర్వహిస్తామన్నారు. కాగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చారు. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మితో పాటుగా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =