‌‌కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్‌-వేదాద్రి ఎత్తిపోతల పథకానికి సీఎం జగన్ శంకుస్థాపన

AP CM YS Jagan, AP CM YS Jagan Launches YSR-Vedadri Lift Irrigation Scheme Works, Lift irrigation Scheme, Lift Irrigation Scheme Works, Vedadri Lift Irrigation Scheme Works, YSR Vedadri Lift Irrigation, YSR Vedadri Lift Irrigation Scheme, YSR Vedadri Lift Irrigation Scheme Works

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రిలో కృష్ణానదిపై నిర్మించనున్న వైఎస్ఆర్‌-వేదాద్రి ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ‌మోహన్ ‌రెడ్డి వర్చువల్‌ విధానంలో ఈ రోజు శంకుస్థాపన చేసి, పైలాన్‌ను ఆవిష్కరించారు. క్యాంప్ ఆఫీస్‌ నుంచి ఈ ఎత్తిపోతల పథకం ప్రారంభానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. వేదాద్రి గ్రామంలో ఈ ఎత్తిపోతల పథకం శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్ పాల్గొన్నారు. అలాగే కృష్ణా జిల్లాకు చెందిన మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, పలువురు నాయకులు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ, వైఎస్ఆర్‌-వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని ఫిబ్రవరి, 2021 కల్లా పూర్తి చేస్తామని తెలిపారు. రూ.491 కోట్ల వ్యయంతో, 2.7 టీఎంసీల నీటి సామర్ధ్యంతో నిర్మించే ఈ ప్రాజెక్టు ద్వారా జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. మూడు మండలాల పరిధిలో మొత్తం 28 గ్రామాలలో 38,607 ఎకరాలకు సాగునీరు అందనుందని సీఎం వైఎస్ జగన్ పేరొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − seven =