ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ప్రముఖ హైకోర్టు లాయర్ జడ శ్రవణ్ కుమార్ ‘జై భీం భారత్ పార్టీ’ని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. కాగా రాష్ట్రంలోని దళితుల కోసమే ఈ సరికొత్త ‘జై భీం భారత్ పార్టీ’ ఏర్పాటు చేస్తున్నట్లు శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. దశాబ్దాలుగా ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు దళితులను మోసం చేస్తున్నాయని, పైకి దళిత పక్షపాతులమని చెప్పుకుంటూ ఓట్లకోసం అవి దళితులని మోసం చేస్తున్నాయని దుయ్యబట్టారు. దీనికి ఏ ఒక్క పార్టీ మినహాయింపు కాదని వెల్లడించారు. ఏపీలో దళిత హోంమంత్రి ఉన్నా దళితులకు న్యాయం జరగడం లేదని శ్రవణ్ కుమార్ వాపోయారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయవాదిగా శ్రవణ్ కుమార్ మంచి గుర్తింపు పొందారు. రాజధాని రైతుల కేసుల విషయంలో కానీ, విశాఖలో వైద్యుడు సుధాకర్ కేసుల్లో కానీ బాధితుల పక్షాన అండగా నిలిచారు. రాష్ట్రంలో ఎక్కడ దళితులపై దాడులు జరిగినా ఆయన ఖండించేవారు. ఇకపై దళితులు ఎవరిముందూ తలొంచుకుని బ్రతకాల్సిన పనిలేదని, ధైర్యంగా తలెత్తుకుని బ్రతకాలని పిలుపునిచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ