‘ట్విట్టర్’‌ కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్న ఎలన్ మస్క్.. 41 బిలియన్ డాలర్స్ ఆఫర్ చేసిన ప్రపంచ కుబేరుడు

Tesla CEO Elon Musk Offers To Buy Twitter Company For $41 Billion, Elon Musk Offers To Buy Twitter Company For $41 Billion, Elon Musk Offers To Buy Twitter Company, Elon Musk Offers To Buy Twitter Company With $41 Billion, Tesla CEO Elon Musk Takes 9.2 Percent Stake in Twitter Company, Tesla CEO Elon Musk is taking a 9.2% stake in Twitter Company, Tesla CEO, Tesla CEO Elon Musk, Elon Musk, $41 Billion, 9.2 Percent Stake in Twitter Company, Tesla CEO Elon Musk purchased approximately 73.5 million shares in Twitter Company, Elon Musk takes 9.2 per cent stake in Twitter Company, Tesla CEO Elon Musk becomes largest shareholder of Twitter Company, largest shareholder of Twitter, Musk buys 9.2 Percent Stake in Twitter Company, Twitter Company, Twitter Company News, Twitter Company Latest News, Twitter Company Latest Updates, Twitter Company Live Updates, Mango News, Mango News Telugu,

ప్రపంచ కుబేరుడు, టెస్లా కంపెనీ సీఈఓ ఎలన్ మస్క్ ట్విట్టర్ పై కన్నేశారా? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ట్విట్టర్ కంపెనీని చేజిక్కించుకోవడానికి భారీ మొత్తం ఆఫర్ చేయటం ఇప్పుడు ప్రపంచ వ్యాపార వర్గాలలో చర్చినీయాంశం అవుతోంది. సోషల్ మీడియా కంపెనీ బోర్డులో సీటును తిరస్కరించిన కొద్ది రోజులకే బిలియనీర్ ఎలన్ మస్క్ ట్విట్టర్‌ను సుమారు $41 బిలియన్లకు కొనుగోలు చేయడానికి ఆఫర్ చేశాడు. గురువారం నాడు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించిన ఎలన్ మస్క్ యొక్క ఆఫర్ ధర ఒక్కో షేరుకు $54.20. ఏప్రిల్ 1న ముగిసిన ట్రేడింగ్ లో ట్విట్టర్‌ షేర్ విలువతో పోలిస్తే ఇది 38% అధికం కావడం విశేషం. మస్క్ ప్రస్తుతం ట్విట్టర్‌ యొక్క స్టాక్‌లో 9 శాతానికి పైగా కలిగి ఉన్నారు. గురువారం మార్కెట్ ప్రారంభానికి ముందే ట్విట్టర్ షేర్లు దాదాపు 12 శాతం ఎగబాకాయి.

“నేను పెట్టుబడి పెట్టినప్పటి నుండి గమనిస్తున్నా.. కంపెనీ పనితీరు ఇలాగే కొనసాగితే అభివృద్ధి చెందడం కష్టం. ట్విట్టర్‌ను ప్రైవేట్ కంపెనీగా మార్చాల్సిన అవసరం ఉంది” అని మస్క్ ట్విట్టర్ ఛైర్మన్ బ్రెట్ టేలర్‌కు ఇటీవల రాసిన లేఖలో తెలిపారు. నా అత్యుత్తమ మరియు చివరి ఆఫర్ ఇదే అని, ఇప్పుడు ఇది అంగీకరించబడకపోతే, నేను వాటాదారుగా నా స్థానాన్ని పునఃపరిశీలించవలసి ఉంటుంది అని మస్క్ పేర్కొన్నారు. ఈ వారం ప్రారంభంలో, మస్క్ తన పదవీకాలం ప్రారంభం కానున్నందున, ట్విట్టర్ బోర్డులో చేరే ప్రణాళికను విరమించుకున్నట్లు చెప్పాడు. అయితే బోర్డు సీటు తీసుకోవడం వల్ల కంపెనీని టేకోవర్ చేయకుండా నిరోధించవచ్చు. తాను ప్రతిపాదించిన ఈ ఆఫర్‌కు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తున్నట్లు మస్క్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 9 =