ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ పార్టీ రంగు వేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. జనవరి 27, సోమవారం నాడు ఈ పిటిషన్‌పై జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పంచాయతీ కార్యాలయాలు ప్రభుత్వానికి సంబంధించినవని, వాటికి పార్టీ రంగులు వేయకూడదని ఏపీ హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనుండడంతో పంచాయతీ కార్యాలయాలపై వైసీపీ పార్టీ రంగులను తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యత తీసుకోవాలని హైకోర్టు కోరింది. అలాగే ఈ అంశంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదికి వాయిదా వేసింది.
[subscribe]