ఏపీ శాసనమండలి ఛైర్మన్ షరీఫ్‌ కు కరోనా పాజిటివ్

Andhra Pradesh, Andhra Pradesh COVID-19 Daily Bulletin, Andhra Pradesh Department of Health, ap coronavirus cases today, AP Coronavirus Updates, AP Legislative Council Chairman, AP Legislative Council Chairman Shariff Tests Positive, COVID-19, MA Sharif tests positive

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, పలు పార్టీల కీలక నాయకులు సైతం కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ శాసనమండలి చైర్మన్‌ షరీఫ్‌కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది. చైర్మన్ షరీఫ్‌ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్సీలు ఆకాంక్షించారు. మరోవైపు ఏపీలో ఆగస్టు 31 నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,34,771 కి చేరుకుంది. వీరిలో 3,30,526 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 1,00,276 మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర తర్వాత ఏపీ రెండో స్థానంలో కొనసాగుతుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu