ఏపీలోని ఆర్‌బీకే కేంద్రాల్లో 2,103 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

APPSC to be Issued Notification For 2103 Posts in Agriculture Horticulture and Silk Assistant Departments Soon, APPSC Notification For 2103 Posts Agriculture, Horticulture and Silk Assistant Departments Soon, Agriculture Horticulture and Silk Assistant, Mango News,Mango News Telugu, Agriculture Horticulture and Silk Assistant Department, APPSC Notification 2022, APPSC Notification, APPSC Notification Agriculture Horticulture and Silk, APPSC Agriculture Horticulture and Silk, Agriculture Horticulture and Silk, APPSC Notification Latest News And Updates

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో రైతు భరోసా కేంద్రాల్లో 2103 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ త్వరలోనే ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్‌ హరికిరణ్‌ ప్రకటించారు. మూడు విభాగాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్, సిల్క్ బోర్డు అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా ఈ శాఖలో మొత్తం 6,758 అగ్రికల్చర్‌ అసిస్టెంట్, 4,000 హార్టికల్చర్‌ అసిస్టెంట్, 400 సిల్క్‌ బోర్డు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గతంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భాగంగా ఇప్పటివరకు 6,321 అగ్రికల్చర్‌ అసిస్టెంట్, 2,356 హార్టికల్చర్‌ అసిస్టెంట్, 378 సిల్క్‌ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేశారు. ఈ క్రమంలో మిగిలిన ఖాళీలను త్వరలో ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ద్వారా భర్తీచేయనున్నట్లు హరికిరణ్‌ తెలియజేశారు.

మొత్తం ఖాళీ పోస్టులు – 2,103

  • హార్టికల్చర్‌ అసిస్టెంట్ – 1644 పోస్టులు,
  • అగ్రికల్చర్‌ అసిస్టెంట్ – 437 పోస్టులు,
  • సిల్క్‌ అసిస్టెంట్ – 22 పోస్టులు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + thirteen =