టాలీవుడ్ అగ్రనటుడు, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాత్రి ఒంగోలు పట్టణంలో నందమూరి బాలకృష్ణ నటించిన కొత్త సినిమా ‘వీర సింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా విడుదల చేసిన సినిమా ట్రైలర్ లో కొన్ని డైలాగులు అధికార పార్టీ నేతలను ఉద్దేశించే అని వ్యాఖ్యలు వినిపించాయి. దీనిపై స్పందించిన మంత్రి అమర్‌నాథ్, బాలకృష్ణపై సెటైర్లు వేశారు.
ఈ మేరకు మంత్రి అమర్‌నాథ్ శనివారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. బాలయ్య ఇప్పుడు బాబు కాదని, బాలయ్య తాత అని అన్నారు. నిన్న ఒంగోలులో జరిగిన వేడుకకు ఎక్కువమంది జనాలు రాలేదని అనుకుంటున్నారని, 60 ఏళ్ళు దాటిన ఆయనను చూడటానికి ఎవరు వస్తారని ఎద్దేవా చేశారు. అలాగే బాలయ్య ఇంకా సమరసింహారెడ్డి అని అనుకుంటున్నారని, కానీ ఆయన ఇప్పుడు వీరసింహారెడ్డి అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలకు, రాజకీయ పార్టీలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. జనాలు రాకనే చంద్రబాబు, బాలకృష్ణలు రోడ్లపై మీటింగ్‌లు పెడుతున్నారని, వాటి వలన అమాయక ప్రజలు మరణిస్తున్నారని అన్నారు. అలాగే, మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనుమతి కోసం, వారు ప్రభుత్వం దృష్టికి తెస్తే పరిశీలించి ఇస్తామని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE