ఆంధ్రప్రదేశ్ లోని ఉద్యోగులు పీఆర్సీ అంశంపై ఏమాత్రం తగ్గడం లేదు. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన జీవోలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీ సచివాలయంలోని మూడో బ్లాక్‌లో సోమవారం ఉద్యోగులు నిరాహార దీక్షకు దిగారు. రివర్స్ పీఆర్సీ తమకు వద్దని డిమాండ్ చేస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఫిబ్రవరి 3న ఉద్యోగసంఘాల ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘ఉద్యోగుల చలో విజయవాడ’ కార్యక్రమాన్ని ఆపడం ఎవరితరమూ కాదని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరిక చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి కొత్త వేతన స్కేళ్ల బిల్లులు చేయించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా మంతుల కమిటీపై విమర్శలు చేశారు. అది అపోహలు తొలగించే కమిటీ కాదు.. ఉద్యోగుల పొట్టల మీద కొట్టే కమిటీ అని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే, రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో ప్రతిరోజూ రిలే నిరాహార దీక్షలు చేస్తూ.. ఉద్యోగులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ