పార్లమెంట్‌ లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగం

2022 Parliament Budget session, 2022 Union Budget, Budget Session 2022 President Ram Nath Kovind Addresses, Budget session of Parliament, Budget Session of Parliament To Be Started, Budget Session of the Parliament 2022, Mango News, Mango News Telugu, Parliament Budget Session, Parliament Budget Session 2022, Parliament Budget Session 2022 President Ram Nath Kovind Addresses Joint Session, Parliament Budget Session Live Updates, Parliament Budget Session Start, Parliament Budget Session Updates, Parties Ahead of Budget Session of the Parliament 2022, President Ram Nath Kovind Addresses Joint Session

ఈరోజు పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగించారు. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వీరులకు నివాళులు అర్పిస్తున్నట్లు చెప్పారు. సబ్‌ కా సాత్‌ సబ్‌ కా వికాస్‌ లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు. అంబేడ్కర్‌ ఆదర్శాలను మార్గదర్శక సూత్రంగా ప్రభుత్వం పరిగణిస్తుందని, ప్రభుత్వ కృషితో యోగా, ఆయుర్వేదం, సంప్రదాయ వైద్యానికి ఆదరణ పెరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

కరోనా మహమ్మారిపై భారత్‌ పోరాటం స్ఫూర్తిదాయకం అన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌. ఈక్రమంలో.. కరోనాపై పోరాటంలో భాగమైన ఫ్రంట్‌లైన్‌ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు రాష్ట్రపతి. ఏడాది కంటే తక్కువ వ్యవధిలో 150 కోట్ల వ్యాక్సినేషన్లు అధిగమించామని, భారత వ్యాక్సిన్లు కోట్లమంది ప్రాణాలను కాపాడాయని వివరించారు. సామాన్యులకు సులభంగా ఆరోగ్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. కోట్లమంది ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులను పొందారన్నారు రాష్ట్రపతి.

అలాగే, క్రీడారంగ బలోపేతానికి వివిధ పథకాలు, సౌకర్యాలు కల్పించామని, ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన ద్వారా రోజుకు 100 కి.మీ. రహదారుల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు రాష్ట్రపతి. భారత్‌మాల కింద రూ.6 లక్షల కోట్లతో 20 వేల కి.మీ. మేర ఎక్స్‌ప్రెస్‌ వేల నిర్మాణం జరిగిందన్నారు కోవింద్‌. ఇంకా,  తెలంగాణ లోని రామప్ప ఆలయం గురించి కూడా ప్రస్తావించారు రాష్ట్రపతి. రామప్ప ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు తీసుకొచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు. అలాగే, దేశంలో ఏర్పాటుకానున్న ఏడు మెగా టెక్స్‌టైల్‌ పార్కులతో భారీగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయన్నారు రాష్ట్రపతి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − twelve =