త్వరలోనే మండల పరిషత్ అధికారుల సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

Errabelli, Errabelli Dayakar Rao, Errabelli Dayakar Rao Assured To Resolve The Problems of Mandal Parishad Officials, Mandal Parishad Officials, Mandal Parishad Officials In Telangana, Mango News, Mango News Telugu, Minister Errabelli, Minister Errabelli Dayakar Rao, Minister Errabelli Dayakar Rao Assured To Resolve The Problems, Minister Errabelli Dayakar Rao Assured To Resolve The Problems of Mandal Parishad Officials, Minister Errabelli News, Problems of Mandal Parishad Officials, Problems of Mandal Parishad Officials In Telangana, telangana, Telangana Mandal Parishad Officials

తెలంగాణలో 60 శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాలలోనే నివసిస్తున్నారని.. ఆయా గ్రామల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి అమలుచేస్తున్న పల్లె ప్రగతి, ఇతర గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు ఏంటో ఉపయోగపడుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అయితే, ఈ పథకాలు సామాన్య ప్రజలకు చేరి విజయవంతం కావాలంటే మండల పరిషత్ అభివృద్ధి అధికారులు అంకితభావంతో కృషి చేయాలని మంత్రి దయాకర్ రావు సూచించారు. మినిస్టర్ క్వార్టర్స్ లో సోమవారం నాడు రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి మండల పరిషత్ అభివృద్ధి అధికారుల 2022 సంవత్సరపు డైరీ, క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న మండల పరిషత్ అధికారుల,  ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిష్కరించి అర్హులైన అందరికీ ప్రమోషన్లు ఇచ్చారని మంత్రి దయాకర్ రావు గుర్తుచేశారు. అలాగే, ఇంకా అపరిష్కృతంగా ఉన్న మిగిలిన సమస్యలు కూడా త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పల్లె ప్రగ్రతి కార్యక్రమం క్రింద గ్రామీణ ప్రాంతాలలోని అన్ని గ్రామ పంచాయతీలకు కేటాయించిన ట్రాక్టర్లు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డ్ లు, ఇతర కార్యక్రమాల వల్ల గ్రామాల రూపురేఖలు మారాయని మంత్రి అన్నారు.

ఈ సందర్భంగా మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారుల, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించరాని తెలిపారు. ఈ కార్యక్రమాలు విజయవంతంగా అమలు కావడానికి మండల పరిషత్ అధికారులు అందరూ రెగ్యులర్ గా గ్రామాలను సందర్శించి ఈ కార్యక్రమాల అమలును ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తున్న పలు పథకాలు విజయవంతం కావడానికి అధికారులు, ఉద్యోగులు మరింతగా కృషి చేయాలని మంత్రి కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − nine =