ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 13 జిల్లాల్లోని 2640 పంచాయతీలు, ఆయా పంచాయతీల పరిధిలో 19,607 వార్డులకు రేపు (ఫిబ్రవరి 17, బుధవారం) పోలింగ్ జరగనుంది. మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కోసం పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముందుగా రాష్ట్రవ్యాప్తంగా ఈ విడతకు సంబంధించి 3211 పంచాయతీలకు నోటిఫికేషన్ విడుదల అవగా 579 పంచాయితీలు, 11,732 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. అలాగే రెండు పంచాయతీల్లో నామినేషన్స్ దాఖలు కాకపోవడంతో అక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో మిగిలిన 2640 పంచాయతీల్లో రేపు పోలింగ్ నిర్వహించనున్నారు.
కరోనా నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేశారు. వెబ్ కాస్టింగ్ ద్వారా అధికారులు పోలింగ్ పక్రియను పర్యవేక్షించనున్నారు. ఇక ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏజెన్సీ ప్రాంతాలలోని గ్రామాల్లో మద్యాహ్నం 1.30 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ ముగిసిన అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు పక్రియను ప్రారంభించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ