ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ సాంకేతిక, వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షల నిర్వహణకు సంబంధించి పలు యూనివర్సిటీలకు బాధ్యతలు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ ఉన్నత విద్యామండలి బుధవారం నాడు ప్రవేశ పరీక్షల నిర్వహణకు చైర్మన్ లను, కన్వీనర్లను ఖరారు చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఫ్రొఫెసర్ కె.హేమచంద్రా రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది ఈఏపీసెట్-2022 (ఎంసెట్) నిర్వహణ బాధ్యతలను జేఎన్‌టీయూ, అనంతపురంకు అప్పగించారు. ఈఏపీసెట్-2022 కన్వీనర్‌గా ప్రొఫెసర్ ఎమ్.విజయకుమార్ ను నియమించారు. మరోవైపు ఈఏపీసెట్ ను మే నెలలో నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
ఏపీలో నిర్వహించే పలు ప్రవేశ పరీక్షలకు చైర్మన్లు, కన్వీనర్లు:
ఈఏపీసెట్ :
- నిర్వహణ: జేఎన్‌టీయూ అనంతపురం
- చైర్మన్: ఫ్రొఫెసర్ జి.రంగజనార్దన్
- కన్వీనర్: ఎమ్.విజయకుమార్
ఈసెట్ :
- నిర్వహణ: జేఎన్‌టీయూ కాకినాడ
- చైర్మన్: ఫ్రొఫెసర్ జీవీఆర్ ప్రసాదరాజు
- కన్వీనర్: ఫ్రొఫెసర్ కృష్ణమోహన్
ఐసెట్ :
- నిర్వహణ: ఏయూ విశాఖపట్నం
- చైర్మన్: ఫ్రొఫెసర్ పీవీజిడి ప్రసాద్ రెడ్డి
- కన్వీనర్: ఫ్రొఫెసర్ ఎన్.కిశోర్‌బాబు
పీజీ ఈసెట్ :
- నిర్వహణ: ఎస్వీయూ తిరుపతి
- చైర్మన్: ఫ్రొఫెసర్ కే.రాజారెడ్డి
- కన్వీనర్: ఫ్రొఫెసర్ ఆర్వీస్ సత్యనారాయణ
లాసెట్ :
- నిర్వహణ: శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ తిరుపతి
- చైర్మన్: ఫ్రొఫెసర్ డి.జమున
- కన్వీనర్: ఫ్రొఫెసర్ టి.సీతాకుమారి
ఎడ్‌సెట్ :
- నిర్వహణ: శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ తిరుపతి
- చైర్మన్: ఫ్రొఫెసర్ డి.జమున
- కన్వీనర్: ఫ్రొఫెసర్ టీజీ అమృతవల్లి
రీసెర్చ్ సెట్ :
- నిర్వహణ: ఉన్నత విద్యామండలి
- చైర్మన్: ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి
- కన్వీనర్: ప్రొఫెసర్ డి.అప్పలనాయుడు (ఏయూ)
పీజీ సెట్ :
- నిర్వహణ: యోగివేమన వర్సిటీ, కడప
- చైర్మన్: ప్రొఫెసర్ ఎమ్.సూర్యకళావతి
- కన్వీనర్: ప్రొఫెసర్ ప్రొఫెసర్ ఎన్.నజీర్ అహ్మద్
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ