తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, శ్రేయస్సు కాంక్షిస్తూ ‘నారసింహ సందర్శన యాత్ర’: పవన్

janasena chief, janasena chief pawan kalyan, Janasena Chief Pawan Kalyan about YCP Leaders Comments, Janasena Chief Pawan Kalyan about YCP Leaders Comments and Narasimha Sandarshana Yatra, Mango News, Narasimha Sandarshana Yatra, pawan kalyan, Pawan Kalyan about Narasimha Sandarshana Yatra, Pawan Kalyan about YCP Leaders Comments, Pawan Kalyan Narasimha Sandarshana Yatra, Pawan Kalyan Narasimha Sandarshana Yatra News, Pawan Kalyan Narasimha Sandarshana Yatra Updates, YCP Leaders Comments

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ బుధవారం జనసేన సోషల్‌ మీడియా విభాగానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై స్పందించారు. తనపై పదేపదే దత్తపుత్రుడు అనే మాటను ప్రయోగించడంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, ” వైసీపీ నాయకత్వానికి నేను ఒక్కటే తెలియజేస్తున్నాను. నేను ప్రజలకు మాత్రమే దత్తపుత్రుడుని. వైసీపీ నాయకులు, సలహాదారులు, గౌరవ పెద్దలు మాట్లాడిన మాటలు, చేసిన కామెంట్లు నా దృష్టికి వచ్చాయి. ఉద్యోగుల సమస్యను విపక్షాలు సృష్టించింది కాదు. తాము ఏం చేసినా డూడూ బసవన్నలా తలూపాలని అనుకుంటున్నారు. అందుకు భిన్నంగా ఉంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నుంచి ఉపాధ్యాయులు వరకూ అందరినీ శత్రువులుగా చూస్తున్నారు. ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు వెళ్ళడం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే” అని అన్నారు.

అలాగే రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, శ్రేయస్సు కాంక్షిస్తూ త్వరలో ‘అనుష్టుప్ నారసింహ సందర్శన యాత్ర’ చేపట్టనున్నట్టు పవన్‌ కళ్యాణ్ తెలిపారు. “మా ఇంటి ఇలవేల్పు, ఆరాధ్యదైవం, నన్ను విద్యుత్ ప్రమాదం నుంచి కాపాడి, నాకు పునర్జన్మనిచ్చిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని ముందుగా దర్శించుకొని, అనంతరం ధర్మపురి నారసింహుని క్షేత్రం, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నాంపల్లి గుట్ట నారసింహుని క్షేత్రాన్ని దర్శించుకుంటాను. మిగతా 30 నారసింహ క్షేత్రాలను దశలవారీగా దర్శించి ప్రజలను చల్లగా చూడాలని స్వామి దీవెనలు కోరుకోవడానికి ఈ యాత్ర సంకల్పించాను. తెలంగాణలోని క్షేత్రాల పర్యటనలో భాగంగా అక్కడి నాయకులు, జన సైనికులతో కూడా పరిమితమైన సమావేశాలు చేయాలని నిర్ణయించాం. అలాగే మార్చి 14న ఆవిర్భావ దినోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =