కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో పలు ప్రవేశ పరీక్షల నిర్వహణ వాయిదా పడిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను ప్రభుత్వం ఇటీవలే ఖరారు చేసి వెల్లడించింది. ఎంసెట్, ఐసెట్, ఈసెట్ మరియు వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించారు. ముందుగా లాక్‌డౌన్ నేపథ్యంలో అన్ని ప్రవేశ పరీక్షల ఆన్‌లైన్ దరఖాస్తు గడువును మే 20వ తేదీ వరకు పొడగించగా, తాజాగా జూన్ 15 వరకు పొడిగించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పీజీ ఈసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీఈసెట్ ప్రవేశ పరీక్షల కోసం ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఆన్‌లైన్ లో జూన్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్:
- ఎంసెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ – జూలై 27 నుంచి 31 వరకు
- ఈసెట్ – జూలై 24
- ఐసెట్ – జూలై 25
- పీజీ ఈసెట్ – ఆగస్టు 2 నుంచి 4 వరకు
- ఎడ్‌సెట్ – ఆగస్టు 5
- లాసెట్ – ఆగస్టు 6
- పీఈసెట్ – ఆగస్టు 7 నుంచి 9 వరకు
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu