ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ అనే వాళ్లు ఎప్పుడూ రోల్ మోడల్స్ గానే నిలుస్తుంటారు. తాజాగా ఆ మాటనే నిజంచేసి నిరూపించారు తొంభై ఆరేళ్ల మహిళ ప్రొఫెసర్. యంగ్ ఏజ్ లోనే ఏమి చేయలేమని నిరాశతో ఇంటికే పరిమితమవుతున్న ఈ రోజుల్లో.. వయోభారంతో నడవలేని స్థితిలో కూడా మానసిక దృఢత్వంతో ఆమె సేవలు అందిస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.
96 ఏళ్ల వయసులో కూడా రోల్ మోడల్ గా నిలిచిన ఆ మహిళ పేరు శాంతమ్మ. 1951లో ఆంధ్రా యూనివర్సిటీలో ఫిజిక్స్ లెక్చరర్ గా జాయిన్ అయి ఎంతోమందికి విద్యాబుద్ధులు అందించారు. అలా ఆమె సుమారు నాలుగు దశాబ్దాల పాటు విద్యార్ధులకు విజయవంతంగా తన సేవలను అందించారు. 1989లో పదవీ విరమణ పొందిన శాంతమ్మ.. అదే ఆంధ్రా యూనివర్శిటీలో మరి కొన్నేళ్ల పాటు గౌరవ అధ్యాపకురాలిగా కొనసాగారు. అయితే ప్రస్తుతం విజయనగరం జిల్లాలో సెంచూరియన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ..శాంతమ్మ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫిజిక్స్ ఆప్టిక్స్ సబ్జెక్టును బోధిస్తున్నారు.
విశాఖపట్నంలో నివాసం ఉంటున్న శాంతమ్మకు.. జీతభత్యాలపై అంతగా ఆసక్తి ఉండదు. ఎప్పుడూ తనకున్న నాలెడ్జ్‌ను, తాను తెలుసుకున్న అంశాలను పదిమందికి అందించాలనే తపనే ఆమెను ఆ వయసులోనూ నడిపిస్తుంటుంది. అందుకే తన వయసును కూడా లెక్క చేయకుండా విశాఖపట్నం నుండి సుమారు 140 కిలోమీటర్లు దూరం.. ప్రతీరోజు ప్రయాణించి విజయనగరంలో విద్యాబోధన చేస్తూ వస్తున్నారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలలో లేని కొత్త కొత్త విషయాలను కూడా వివరిస్తూ ఉంటారు. ఒక్క విద్యాబోధనలోనే కాకుండా విద్యార్ధులతో.. కలిసి నవ్వుతూ నవ్విస్తూ సరదాగా గడుపుతూ స్టూడెంట్స్ కు ఫేవరేట్ ప్రొఫెసర్ అయిపోయారు శాంతమ్మ.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE