- బద్వేలులో అధికార వైఎస్సార్సీపీ భారీవిజయం దిశగా దూసుకెళ్తుంది. 8 రౌండ్ల కౌంటింగ్ అనంతరం తన సమీప బీజేపీ అభ్యర్థి పనతల సురేష్ పై వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ సుధ 68,492 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరో మూడు రౌండ్ల ఫలితాలు వెలువడాల్సి ఉన్నప్పట్టికీ భారీ మెజార్టీతో వైఎస్సార్సీపీ విజయం ఖరారైంది.
- బద్వేలులో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కాగా బద్వేలులో అధికార వైఎస్సార్సీపీ హవా కొనసాగుతుంది. ఆరు రౌండ్ల కౌంటింగ్ అనంతరం తన సమీప బీజేపీ అభ్యర్థి పనతల సురేష్ పై వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ సుధ 52,024 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు వైఎస్సార్సీపీకి 64,265 ఓట్లు, బీజేపీకి 12,241 ఓట్లు పోలయ్యాయి.
- బద్వేలులో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతుంది. మూడో రౌండ్ల కౌంటింగ్ అనంతరం సమీప బీజేపీ అభ్యర్థి పనతల సురేష్ పై వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ సుధ 23754 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
- బద్వేలులో మొదటి రౌండ్ కౌంటింగ్ ముగిసింది. మొదటి రౌండ్ అనంతరం అధికార వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ సుధ 8790 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వైఎస్సార్సీపీకి 10,478, బీజేపీకి 1688, కాంగ్రెస్ కు 580 ఓట్లు లభించాయి.
- పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆధిక్యంలో నిలిచిన వైఎస్సార్సీపీ.
—> ఆంధ్రప్రదేశ్ లోని బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. బద్వేలు పట్టణ శివారులోని బాలయోగి గురుకుల పాఠశాలలో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కోసం మొత్తం 4 హాళ్లలో 28 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ముందుగా 235 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించి, అనంతరం ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. మొత్తం పది రౌండ్స్ లోనే ఓట్లను లెక్కింపు జరగనుండగా, ఫలితం మధ్యాహ్నం లోపులోనే వెల్లడి కానుంది. బద్వేలు నియోజకవర్గంలో అక్టోబర్ 30న జరిగిన పోలింగ్ లో 68.39 శాతం (1,47,213 ఓట్లు) పోలింగ్ నమోదైంది.
—> బద్వేలు పోరులో మొత్తం 15 మంది బరిలో నిలిచినప్పటికీ, ముఖ్యంగా ప్రధాన పార్టీలైన వైఎస్సార్సీపీ, బీజేపీ, కాంగ్రెస్ ల మధ్యే పోరు నెలకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధ బరిలో నిలవగా, బీజేపీ అభ్యర్థిగా పనతల సురేష్, కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే కమలమ్మ పోటీ చేస్తున్నారు. మూడు పార్టీల నేతలు కూడా తమ అభ్యర్థి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అధికార వైఎస్సార్సీపీ అభ్యర్థి సాధించబోయే మెజార్టీపై పెద్దఎత్తున జరుగుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ