రాజధాని ఫైల్స్ సినిమా రిలీజ్‌పై స్టే విధించిన ఏపీ హైకోర్టు

AP Politics, Political cinemas, AP, Rajadhani Files,Amaravati, YSRCP,CM Jagan, Vyooham, latest movie updates, high court, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, Mango News Telugu, Mango News
AP Politics, Political cinemas, AP, Rajadhani Files, AP

ఎన్నికలవేళ ఏపీలో నేతలు రచ్చ చేస్తున్నారు. విమర్శలకు ప్రతివిమర్శలు.. కౌంటర్లకు రీ కౌంటర్లు ఇస్తూ కాక రేపుతున్నారు. ఇప్పటికే ఏపీ రాజకీయాలు దద్దరిళ్లుతుంటే.. అటు పొలిటికల్ సినిమాలు అగ్గికి ఆజ్యం పోస్తున్నాయి. ఏపీ పాలిటిక్స్‌ను మరింత హీటెక్కిస్తున్నాయి. యాత్ర-2, వ్యూహం, రాజధాని ఫైల్స్, అమ్మఒడి వంటి సినిమాలు రచ్చ చేస్తున్నాయి. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర, ఆయన మరణానంతరం జరిగిన పరిణామాల దృష్ట్యా ఇటీవల తెరకెక్కిన యాత్ర-2 మూవీ సంచలనం సృష్టించింది. ఇప్పుడు కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిన రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వ్యూహం సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈనెల 23న వ్యూహం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదే సమయంలో రాజధాని ఫైల్స్ మూవీ తెరకెక్కుతోంది. అమరావతినే ఏపీ రాజధానిగా ఉంచాలంటే రైతులు చేస్తున్న పోరాటం ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. అయితే ఈ సినిమాపై ముందు నుంచి కూడా వైసీపీ సర్కార్ భగ్గుమంటోంది. ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌ను అప్రతిష్టపాలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాను రూపొందించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఈ సినిమా విడుదలను ఆపేయాలంటూ హైకోర్టు మెట్లు కూడా ఎక్కారు. రాజధాని ఫైల్స్ సినిమా విడుదలకు అనుమతి ఇవ్వొద్దంటూ  వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.

తాజాగా ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. రాజధాని ఫైల్స్ చిత్ర బృందానికి షాక్ ఇచ్చింది. ఈరోజు సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. విడుదలపై హైకోర్టు స్టే విధించింది. సినిమా ప్రదర్శనను శుక్రవారం వరకు నిలిపివేయాలని ఆదేశించింది. ఈ మేరకు సినిమాకు సంబంధించిన పూర్తి రికార్డులను కోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తి చిత్ర బృందాన్ని ఆదేశించారు. కోర్టులో వైసీపీ తరుపున న్యాయవాది ప్రశాంత్.. చిత్ర నిర్మాతల తరుపున న్యాయవాది మురళీధరరావు వాదనలు వినిపించారు.

రాజధాని సినిమా లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వాన్ని సీఎం జగన్‌ని అప్రతిష్టపాలు చేయడమేనని న్యాయవాది ప్రశాంత్ కోర్టుకు వివరించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు.. ప్రజల్లో వైసీపీని పలుచన చేసేందుకు అసత్యాలతో, సత్యదూరమైన విషయాలతో ఈ సినిమాను రూపొందించారని పేర్కొన్నారు. మరోవైపు సినిమాను రివిజన్ కమిటీ, ఎగ్జామిన్ కమిటీ చూసిందని.. పలు సన్నివేశాలను తొలగించాలని ఆదేశిస్తే.. తొలగించామని కోర్టుకు నిర్మాతల తరుపున న్యాయవాది వివరించారు. ఈ మేరకు ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు చివరికి సినిమా విడుదలపై స్టే విధించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 1 =