తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 160 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో నవంబర్ 1, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,71,000 కి పెరిగింది. అలాగే కరోనాతో మరో ఇద్దరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 3,958 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక సోమవారం నాడు 35,326 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 193 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 6,63,691 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,974యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (160):
- జీహెచ్ఎంసీ ఏరియా – 59
- కరీంనగర్ – 13
- మేడ్చల్ మల్కాజిగిరి – 11
- ఖమ్మం – 11
- రంగారెడ్డి – 5
- వరంగల్ అర్బన్ – 5
- నల్గొండ – 5
- జగిత్యాల – 4
- భద్రాద్రి కొత్తగూడెం – 4
- నాగర్ కర్నూల్ – 4
- మంచిర్యాల – 4
- రాజన్న సిరిసిల్ల – 4
- నిజామాబాద్ – 4
- సిద్దిపేట – 4
- వరంగల్ రూరల్ – 4
- యాదాద్రి భువనగిరి – 3
- కొమరం భీం ఆసిఫాబాద్ – 2
- ఆదిలాబాద్ – 2
- మహబూబాబాద్ – 2
- పెద్దపల్లి – 2
- సూర్యాపేట – 2
- వికారాబాద్ – 1
- వనపర్తి – 1
- సంగారెడ్డి – 1
- ములుగు – 1
- మెదక్ – 1
- మహబూబ్ నగర్ – 1
- నిర్మల్ – 0
- జనగామ – 0
- కామారెడ్డి – 0
- జోగులాంబ గద్వాల్ – 0
- జయశంకర్ భూపాలపల్లి – 0
- నారాయణ్ పేట్ – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ