పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) భారీ షాక్ ఇచ్చింది. జనసేన పార్టీ ఎన్నికల గుర్తుగా ఉన్న ‘గాజు గ్లాసు’ను ఫ్రీ సింబల్స్ జాబితాలో చేరుస్తూ ప్రకటన విడుదల చేసింది. తద్వారా ఆ పార్టీ తన ఎన్నికల చిహ్నమైన టీ గ్లాసు గుర్తును కోల్పోయినట్లైంది. ఈసీ తీసుకున్న సంచలన నిర్ణయంతో గాజు గ్లాసు ఇప్పుడు జనసేనది మాత్రమే కాదు, అందరిదీ.. అంటే దేశవ్యాప్తంగా ఏదేని ఎన్నికల్లో ఆ గుర్తు ఎవరికైనా దక్కవచ్చు. దీంతో ఇప్పుడా గుర్తు తమకు దక్కుతుందో, లేదోనన్న ఆందోళన జనసేన పార్టీలో నెలకొంది. కాగా ఈసీ నిర్ణయంపై జనసేన ఇంకా స్పందించలేదు. దీనిపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. అసలెందుకు ఇలా జరిగిందంటే.. భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం దేశంలోని ఏదైనా ఒక రాజకీయ పార్టీ ప్రాంతీయ లేదా జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కొన్ని ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. తన గుర్తును నిలుపుకోవాలంటే ఎన్నికల్లో నిర్ణీత ఓట్ల శాతాన్ని పొందవలసి ఉంటుంది.
ఈసీ నిబంధనల ప్రకారం.. ప్రాంతీయ పార్టీగా గుర్తింపు రావాలంటే ఎన్నికల్లో పోలైన ఓట్లలో ఆరు శాతం, కనీసం రెండు స్థానాలను దక్కించుకోవాలి. అయితే జనసేన కొన్ని ఎన్నికల్లో పోటీ చేయకపోవడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో అతి తక్కువ స్థానాల్లో మాత్రమే పోటీ చేయడం ఆ పార్టీకి మైనస్ అయింది. గత ఎన్నికల్లో జనసే పార్టీ ఆరు శాతం ఓట్లు పొందినప్పటికీ, కేవలం ఒకే ఒక్క సీటును మాత్రమే గెలుచుకోగలిగింది. మరో స్థానాన్ని కూడా గెలుచుకొని ఉంటే జనసేన ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందేది. దీంతోపాటు ఏపీలోని 25 లోక్ సభ స్థానాల్లో ఒక్క ఎంపీ సీటును గెలుచుకున్నా కూడా ప్రాంతీయ పార్టీ హోదా దక్కేది. కానీ ఇది కూడా జరుగలేదు. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ గుర్తును ఈసీ ఫ్రీ సింబల్ జాబితాలోకి చేర్చింది. కాగా గతంలో ఏపీలోని బద్వేలు ఉప ఎన్నిక, తిరుపతి లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ గాజు గ్లాసు గుర్తును ఈసీ వేరే పార్టీ అభ్యర్థులకు కేటాయించిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE