విజయవాడలో ‘వాలంటీర్లకు వందనం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్, పలువురికి పురస్కారాల ప్రదానం

AP CM YS Jagan Launches Salute To Volunteers in Felicitation Programme at Vijayawada Today,AP CM YS Jagan Launches Salute To Volunteers,Felicitation Programme at Vijayawada Today,AP CM YS Jagan in Felicitation Programme,AP CM YS Jagan at Vijayawada Today,Mango News,Mango News Telugu,Govt To Honour Volunteers, Jagan to felicitate volunteers,CM YS Jagan Latest Updates,CM YS Jagan Praises Volunteers,Vijayawada Latest News,Vijayawada Volunteers Latest News,Volunteers in Felicitation Programme,Andhra Pradesh Latest News, Andhra Pradesh News, Andhra Pradesh News And Live Updates, AP CM Jagan Latest News And Live Updates, AP CM YS Jagan Mohan reddy

ఆంధ్రప్ర‌దేశ్‌లో వాలంటీర్లు చేస్తున్న సేవలకు గుర్తింపుగా ప్రతీ ఏడాది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ‘వాలంటీర్లకు వందనం’ అనే కార్యక్రామాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా వరుసగా మూడో ఏడాది గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ఇచ్చే కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో శుక్రవారం విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మంత్రి ఆదిమూలపు సురేష్ సహా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ చేతుల మీదుగా పురస్కారాలు అందుకోవడం ఆనందాన్నిస్తోందని, ఈ అవార్డులతో తమ బాధ్యత మరింత పెరిగిందని అవార్డు గ్రహీతలు పేర్కొన్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించే క్రమంలో తమ వంతుగా తోడ్పాటు అందిస్తామని, ఇకపై మరింత సమర్ధవంతంగా పనిచేస్తామని చెప్పారు. అనంతరం సీఎం జగన్ వాలంటీర్లను ఉద్దేశించి ప్రసంగించారు.

సీఎం జగన్ ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు..

  • రాష్ట్రంలో గతంలో పెన్షన్లు కోసం అధికారుల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది.
  • వైసీపీ ప్రభుత్వం వచ్చాక దీనిని పరిష్కరించేందుకు వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించాం.
  • గత ఎన్నికల్లో ప్రకటించిన ‘నవ రత్నాలు’ ప్రజలకు చేరువ కావడంలో వాలంటీర్ల సేవలు అద్భుతం.
  • ఏపీలో 2.66 లక్షల మంది వాలంటీర్లు స్వచ్చందంగా పేదలకు సేవలందిస్తున్నారు.
  • ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేరుస్తూ.. ఇద్దరికీ నడుమ వాలంటీర్లు వారధిగా నిలుస్తున్నారు.
  • ప్రతి నెలా 1వ తేదీన సుమారు 64 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్న నిజమైన సంక్షేమ సారథులు.
  • కులం, మతం, ప్రాంతం, లింగ వివక్ష లేకుండా 90శాతం ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందిస్తున్న దేశంలోనే ఏకైక వ్యవస్థ మన సొంతం.
  • ప్రజలకు పెన్షన్లతో పాటు ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు వంటివి కూడా అందిస్తున్నారు.
  • ఆసరా, అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, ఇళ్ల పట్టాలు వంటి పథకాలను అర్హులకు ఠంచనుగా అందిస్తున్నారు.
  • దాదాపు 25 పథకాలకు సంబంధించి లబ్దిదారులను ఎంపిక చేయడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + four =