వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తు

AP News, CBI Interrogating Key Suspects in YS Vivekananda Reddy Case, YS Vivekananda Reddy, YS Vivekananda Reddy Case, YS Vivekananda Reddy Case News, YS Vivekananda Reddy Case Updates, YS Vivekananda Reddy Murder, YS Vivekananda Reddy Murder Case

మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. గత 12 రోజులుగా ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు జరుపుతుంది. కడప సెంట్రల్ జైలులోని అతిథి గృహంలో ఈ కేసుకు సంబంధించి పలువురిని వరుసగా విచారిస్తున్నారు. మంగళవారం నాడు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతను దాదాపు మూడు గంటల పాటుగా సీబీఐ అధికారులు విచారించారు. హత్య జరిగిన రోజు నుంచి జరిగిన పలు అంశాలపై ఆమెను సీబీఐ ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. ఈ రోజున పులివెందులకు చెందిన వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డిని కూడా సీబీఐ అధికారులు విచారించనున్నారు. అలాగే గతంలో ఈ కేసులో సిట్ నిర్వహించిన దర్యాప్తు నివేదికను కూడా సీబీఐ అధికారులు పరిశీలించారు. మొత్తం 15 మంది కీలక అనుమానితులను గుర్తించినట్టు సమాచారం. వీరందరిని సీబీఐ అధికారులు వరుసగా విచారించనున్నారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu