రాష్ట్రంలో సుపరిపాలన అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యం

#KCR, Adilabad, erstwhile Adilabad District, KTR Latest News, KTR Meeting In Adilabad, KTR Review Meeting on Municipalities, Minister KTR, Minister KTR Review Meeting, telangana

రాష్ట్రంలో సుపరిపాలన అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, ఆ దిశగా ప‌రిపాల‌న వికేంద్రిక‌ర‌ణ చేశార‌ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ అన్నారు. జూలై 28, మంగళవారం నాడు బుద్ధ భ‌వ‌న్ లో జరిగిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీలపై రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. పురపాలక సంఘాల పరిధిలోని పట్టణాల్లో రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి కనీస అవసరాలపై ప్రధాన దృష్టి సారించాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి కేటిఆర్ దిశానిర్దేశం చేశారు. మున్సిపాలిటీల‌లో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నులు, చేప‌ట్టాల్సిన కార్యక్రమాలపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ, మున్సిపాలిటీల అభివృద్ధికి ఓ అభివృద్ధి నమూనాను తయారు చేసుకోవాల‌న్నారు. దీని ఆధారంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చడమే లక్ష్యంగా పురపాలన కొనసాగాలని చెప్పారు. రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, ప‌చ్చ‌దనం వంటి వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు. కొత్త పురపాలక చట్టం నిర్దేశించిన విధులను ఖ‌చ్చితంగా అమలు చేయాలన్నారు.

పారిశుద్ద కార్మికులకు స‌కాలంలో జీతంలో చెల్లించాల‌న్నారు. వారికి అవసరమైన దుస్తులు, బూట్లు, మాస్క్‌లు ఆయా మున్సిపాలిటీలే అందించాలన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో ప్రతి వెయ్యి మందికి ఒక టాయిలెట్ ఉండేలా లక్ష్యంతో పని చేయాలన్నారు. ఇందులో 50 శాతం షీ టాయిలెట్లు ఉండాలన్నారు. ప్రతి మున్సిపల్ కమిషనర్, చైర్మన్ ఉదయం 5.30 గంటలకే ఫీల్డ్‌లో ఉండాలని, స‌ర్ ఫ్రైజ్ విజ‌ట్ చేయాల‌ని మంత్రి కేటిఆర్ ఆదేశాలు ఇచ్చారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =