ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పదవీ కాలం మరో ఆరు నెలలు పాటు పొడిగించబడింది. మే 31, 2022 వరకు సీఎస్ పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదివారం నాడు నిర్ణయం తీసుకుంది. సీఎస్ సమీర్‌శర్మ నవంబర్ 30తో పదవీ విరమణ చేయాల్సి ఉండడంతో, ముందుగా సీఎస్ పదవి కాలం పొడిగింపుకు సంబంధించి నవంబర్ 2న ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఈ నేపథ్యంలోనే సీఎస్ పదవీ కాలాన్ని ఆరు నెలల పాటుగా పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ