ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు శివశంకర్‌ మాస్టర్‌ కన్నుమూత

Well-known Choreographer Shiva Shankar Master Passes Away due to COVID-19 Complications

ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు శివశంకర్‌ మాస్టర్‌(72) కన్నుమూశారు. కొన్నిరోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన హైదరాబాద్‌ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. సినిమా రంగంలో గొప్ప కొరియోగ్రాఫర్‌ గా శివశంకర్‌ మాస్టర్‌ తనదైన ముద్ర వేశారు. తెలుగు, తమిళ, హిందీ సహా పలు భాషల్లో 800లకు పైగా చిత్రాల్లోని పాటలకు ఆయన కొరియోగ్రాఫర్‌ గా పనిచేశారు. మగధీర చిత్రంలోని పాటకు గానూ ఆయన జాతీయ అవార్డు అందుకున్నారు.

కొరియోగ్రాఫర్‌ గానే కాకుండా దాదాపు 30కి పైగా చిత్రాల్లో నటుడిగా తనదైన ప్రత్యేక శైలిలో ప్రేక్షకులను అలరించారు. అలాగే పలు డాన్స్, కామెడీ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. కరోనాను జయిస్తారని భావిస్తున్న సమయంలో శివశంకర్‌ మాస్టర్‌ మరణంతో సినీపరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. శివశంకర్‌ మాస్టర్ మృతి పట్ల సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =