వైసీపీ ప్రభుత్వ పాలనలో అమరావతిలో ఎంతటి విధ్వంసం జరిగిందో అందరికీ తెలిసిందే. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక అమరావతికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ మేరకు గురువారం అమరావతి రాజధాని ప్రాంతంలో ఆయన పర్యటించారు. ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి మొదట ప్రజావేదిక శిథిలాలను పరిశీలించారు. అక్కడి నుంచి నేరుగా ఉద్దండరాయునిపాలెం వెళ్లి ప్రధాని మోడీ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆ ప్రదేశంలో చంద్రబాబు మోకాళ్లపై కూర్చొని నమస్కరించారు.
శంకుస్థాపన చేసిన ప్రాంతంలో చంద్రబాబు సాష్టాంగ ప్రణామం చేసి.. రాజధానికి తన ప్రాధాన్యమేంటో గుర్తు చేశారు. ఆ తర్వాత ఐకానిక్ భవనాల నిర్మాణం కోసం అప్పట్లో పనులు మొదలు పెట్టిన ప్రాంతంతో పాటు.. సీడ్ యాక్సెస్ రోడ్, ఆలిండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను, ఇతర నిర్మాణాలను చంద్రబాబు పరిశీలించారు. అలాగే అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు, అధికారులతో చంద్రబాబు నాయుడు చర్చించారు. అక్కడి తాజా పరిస్థితిని చంద్రబాబు తెలుసుకునేందుకు ప్రయత్నించారు.
చంద్రబాబు అధికారులతో అమరావతి రాజధానిపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈనెల 24న జరిగే కేబినెట్ భేటీలో రాజధానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇక అమరావతికి చంద్రబాబు వస్తున్నారని తెలిసి పెద్ద ఎత్తున ఆ ప్రాంత ప్రజలు, రైతులు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE