ఏపీ ఉద్యోగులకు పీఆర్సీ ఇకపై ఐదేళ్లకోసారి.. జగన్ సర్కార్ ఉత్తర్వులు

AP Government Issues New Go's Regarding Implementation of Pay Revision For Employees, New Go's Regarding Implementation of Pay Revision For Employees, Implementation of Pay Revision For Employees, New Go's Regarding Implementation of Pay Revision, AP Government Issues New Go's Regarding Implementation of Pay Revision, AP Government, Andhra Pradesh government releases eight GOs on pay revision, eight New GOs on pay revision, New GOs on pay revision, State government issued eight GOs related to the implementation of 11th Pay Revision Commission, Pay Revision Commission, PRC, Implementation of Pay Revision, Pay Revision Commission News, Pay Revision Commission Latest News, Pay Revision Commission Latest Updates, Pay Revision Commission Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు వేతన సవరణ సంఘం (పీఆర్సీ)ని ఐదేళ్లకోసారి ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది. గతంలో ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల సందర్భంగా.. ఉద్యోగుల డిమాండ్ మేరకు పీఆర్సీ అమలు ఉత్తర్వుల్లో పలు సవరణలకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో తాజాగా పదేళ్లకు బదులు ఐదేళ్లకోసారి పీఆర్సీ ఏర్పాటు చేయడంతో పాటు ఇతర అంశాలపై కొత్త జీవోలు జారీ చేసింది. పీఆర్సీ అమలుకు సంబంధించి సచివాలయంలో నిన్న పలు ఉద్యోగ సంఘాల నాయకులతో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్ బృందం సమావేశమైంది. సమావేశంలో అధికారులు ఈ కొత్త జీవోల ప్రతులను ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు అందజేశారు. వీటి ప్రకారం అమలు కానున్న ముఖ్య జీవోలు..

– ఉద్యోగుల పీఆర్సీ బకాయిలను వారి రిటైర్‌మెంట్‌ సమయంలో ఇచ్చేందుకు నిర్ణయం
– ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ఐదు స్టాగ్నేషన్‌ ఇంక్రిమెంట్లను అందజేయడానికి ఆమోదం
– గతంలో చెప్పినట్లు కాకుండా, ఉద్యోగుల డిమాండ్ మేరకు ఐఆర్‌ రికవరీ చేయబోమని హామీ
– ఉద్యోగుల ట్రావెలింగ్‌ అలవెన్స్‌ పెంపుకు ఆమోదం
– ఉద్యోగుల అంత్యక్రియలకు రూ. 25 వేలకు పెంచుతూ నిర్ణయం

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 12 =