ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు.. మరిన్ని చిక్కుల్లో పడబోతున్నారా అన్న వార్తలు ఏపీలో గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు వెంటాడుతున్న కేసులే కాదు.. గతంలో కేసులు కూడా తెరపైకి తీసుకురావడానికి వైసీపీ పావులు కదుపుతోందన్న న్యూస్ ఒకటి రాజకీయవర్గాలలో చక్కర్లు కొడుతుంది. ఎందుకంటే..ఎన్నికలకు ముందు చంద్రబాబును బయటకు రాకుండా చేయడమే వైసీపీ టార్గెట్‌గా కనిపిస్తోంది.
ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, అంగళ్లు, ఫైబర్ గ్రిడ్ స్కామ్ కేసులలో చంద్రబాబు బయటపడలేక ఉక్కిరిబిక్కిరి అవుతుంటే..సరిగ్గా ఇలాంటప్పుడే ఎప్పుడో కనుమరుగైపోయిందనకున్న ఓటుకు నోటు కేసు ఒక్కసారిగా తెర మీదకు రావడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఈ ఓటుకు నోటు కేసు వ్యవహారంలో వీడియోతో సహా అడ్డంగా దొరికిపోవడంతో..అప్పట్లో ప్రస్తుత పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చుట్టూనే ఈ కేసంతా తిరిగింది. ఈ కేసులో రేవంత్ రెడ్డి జైలుకు కూడా వెళ్లొచ్చారు. అయితే తాజాగా కేసు మళ్లీ తెర మీదకు తీసుకువచ్చిన వైసీపీ ఎమ్మెల్యే ..అందులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని కోరుతూ..కేసు విచారణ సీబీఐకి అప్పగించాలని పిటిషన్ దాఖలు చేయడమే ఇప్పుడు కలకలం రేపుతోంది. దీని వెనుక చంద్రబాబును జైలులోనే మగ్గేలా చేయడమే వైసీపీ ప్రధాన ఎజెండాగా కనిపిస్తుందంటూ టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
నిజం చెప్పాలంటే..చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎదుర్కోలేని విధంగా కేసులు ఒక్కొక్కటి చుట్టుముడుతున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైములో చాలామంది కేసులు వేసినా కూడా చంద్రబాబు వెంటనే స్టేలు తెచ్చుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడంతా చంద్రబాబుకు బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్లు స్టే తెచ్చుకునే ఛాన్స్ కూడా లేకుండానే సీఐడీ అధికారులు కేసులు దాఖలు చేస్తున్నారు. అటు ఎన్నడూ కోర్టు మెట్లు కూడా ఎక్కని చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా మగ్గుతున్నారు. ఒకవేళ ఏదొక కేసు నుంచి చంద్రబాబు బెయిల్‌పై విడుదలైనా కూడా.. మరోకేసులో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోలేని పరిస్థితి చంద్రబాబు ముందుంది.
వరుస పెట్టి ఏపీ సీఐడీ కేసులు పెడుతుండటంతో..ఇప్పటికే చంద్రబాబు కేసులు కోర్టులో విచారణలో ఉన్నాయి. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. బెయిల్ మాత్రం రావడం లేదు. ఇప్పటికే చంద్రబాబుపై స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు, విజయనగరంలో ఉద్రిక్త పరిస్థితులు వంటి కేసులు నమోదు చేసిన ఏపీ సీఐడీ తాజాగా ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో కూడా చంద్రబాబు పేరును నమోదు చేసింది. సరిగ్గా ఇలాంటి సమయంలో ఈ కేసులతోపాటు ఓటుకు నోటు కేసు తెర మీదకు రావడం రాజకీయ వర్గాలలో కలకలం రేపుతోంది. అప్పుడు ఈ కేసులో రేవంత్ రెడ్డి పేరు ఒక్కటే ఉండగా..తాజాగా చంద్రబాబు పేరును కూడా నిందితుడిగా పరిగణనలోకి తీసుకోవాలని వైసీపీ నేతలు పిటిషన్ దాఖలు చేయడం కేవలం కుట్రపూరితమైనదేనని టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE