బలపం బట్టి బామ్మ బడిలో అఆఇఈ నేర్చుకుంటే..

A 92 Year Old Grandmother Is Going To School To Study,A 92 Year Old Grandmother,92 Year Old Is Going To School To Study,Mango News,Mango News Telugu,A 92-Year-Old Grandmother,Grandmother Going To School, Salima Khan, Bulandarshahr, Uttar Pradesh,Salima Khan Going To School,Uttar Pradesh Latest News,Uttar Pradesh Latest Updates,Grandmother Going To School News Today,Grandmother Going To School Latest News,Salima Khan Live News

చదువుకోవాలన్న కోరిక చిన్నప్పటి నుంచీ పెరిగి పెద్దదయింది కానీ.. ఈ కోరిక నెరవేరలేదు. అందరిలా తాను కూడా చక్కగా రాయాలి.. చక్కగా చదవాలంటూ ఎప్పుడూ ఆలోచించేది కానీ ఆ ఆశ తీరలేదు కానీ 92 ఏళ్ల వయసు వచ్చేసింది. దీంతో ఇప్పటికైనా తాను చదువుకోవాలని .. చదువుకు వయసుతో పనేంటి అంటూ పలకా, బలపం పట్టి స్కూలుకు వెళుతోంది ఆ బామ్మ. ప్రతీ రోజూ విద్యార్థులతో కలిసి చదువుకుంటున్న ఈ బామ్మ విషయం మాత్రం రీసెంటుగానే వెలుగులోకి వచ్చింది.

ఉత్తర్‌ప్రదేశ్‌ బులందర్‌షహర్‌కు చెందిన సలీమా ఖాన్.. 1931లో జన్మించింది. 14 ఏళ్ల వయసులోనే సలీమాకు పెళ్లి చేయడంతో సంసార బాధ్యతల్లో మునిగిపోయింది. తమ ఊరిలో అప్పట్లో బడి సౌకర్యం లేకపోవడం, అప్పటి పరిస్థితుల వల్ల చిన్నతనంలో చదువుకునే అవకాశం తనకు దొరకలేదు. దీంతో తాను ఎలా అయినా చదువుకోవాలంటూ చిన్నప్పటి నుంచి తనలో ఉన్న కోరికను తీర్చుకోవడానికి ఆరు నెలల క్రితమే స్కూలుకు వెళ్లడం ప్రారంభించింది. తన కంటే దాదాపు 8 దశాబ్ధాలు చిన్న వారైన పిల్లలతో కలిసి స్కూల్‌కు వెళ్తూ..చదవడం, రాయడం నేర్చుకుంది.ఇలా ఒకటి నుంచి వంద వరకు అంకెలను లెక్కపెడుతున్న సలీమా వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతోనే సలీమా బామ్మ కథ వెలుగు చూసింది.

ఆరునెలల నుంచి చదువుకుంటున్న సలీమా తాను కూడా అందరిలా చదవగలుగుతున్నందుకు తెగ సంతోషం వ్యక్తం చేస్తోంది. తాను కూడా చదవగలుగుతున్నానని.. రాయగలుగుతున్నానని సంతోషంగా చెబుతోంది.అంతేకాదు ఇప్పుడు డబ్బులు కూడా లెక్కపెట్టగలుగుతున్నానని..తన మనవలే స్వయంగా తనకు డబ్బు తక్కువ ఇచ్చి మోసం చేసేవారని చెప్పుకొస్తుంది. అంతేకాదు.. ఇప్పుడు తాను అన్నీ చదవగలుగుతున్నా కాబట్టి.తన సంతోషాన్ని చెప్పడానికి మాటలు సరిపోవడం లేదంటూ సలీమా ఆనందం వ్యక్తం చేస్తోంది.

చదువుకు వయసుతో సంబంధం లేదనే నిజాన్ని సలీమా మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిందని సలీమా టీచర్లు కూడా ఆనందంగా చెబుతున్నారు.నిజానికి విద్యా వాలంటీర్ల చొరవతోనే సలీమా స్కూలుకు వెళ్లి చదవగలిగిందని అంటున్నారు.అయితే మొదట్లో సలీమాకు చదువు చెప్పడానికి టీచర్‌లు ఆలోచించేవారట. ఎందుకంటే చదువకోవాలన్న తపన , అభిరుచి ఆమెలో గమనించిన టీచర్లు.. ఇంకాస్త ఎక్కువ సమయాన్నే సలీమా కోసం కేటాయించి చదువులు చెప్పేవారట. ఆ వయసులో ఆమెలో కనిపించిన పట్టుదలే మిగిలిన టీచర్లలోనూ ఉత్సాహాన్ని నింపి సలీమాకు చదువు చెప్పడానికి ముందుకు వచ్చేలాచేసింది.

అంతేకాదు ఇప్పుడు సలీమా ఆ ఊరు వారికి రోల్ మోడల్‌గా కూడా మారిపోయింది. 92 ఏళ్ల వయసులో సలీమా వెళ్తుంది కాబట్టి..తామూ చదువుకుంటామంటూ కొంతమంది మహిళలు పట్టుపట్టేసరికి ఇంట్లో వాళ్లు ఇప్పుడు వాళ్లను కూడా స్కూలుకు పంపిస్తున్నారట. ఏకంగా 25మంది మహిళలు ఇప్పుడు సలీమా చదువుకొంటున్న స్కూలుకు వెళ్లి చదువుకోవడం ప్రారంభించారట.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =