బీజేపీని జనసేనాని లైట్ తీసుకుంటున్నారా?

Is Janasena Taking Light Of BJP,Is Janasena Taking Light,Taking Light Of BJP,Janasena And BJP,Mango News,Mango News Telugu,Janasena, BJP,Pawan Kalyan,Team Is With TDP,AP Politics, TDP,YCP,Janasena Chief Pawan Kalyan,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News And Live Updates,Janasena Latest News,Janasena Latest Updates,Janasena Live News

కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాలు హీటెక్కినట్లే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్ట్ తర్వాత దేశవ్యాప్తంగా అందరి నేతల చూపు ఏపీపైనే పడింది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ పొత్తుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసారు. అప్పటి వరకూ బీజేపీతోనే ఉన్న పవన్.. టీడీపీతో కలిసి నడుస్తారా అన్న అనుమానాలను ఒక్కసారిగా పటాపంచలు చేశారు.

నిజానికి ఇప్పటి వరకూ ఏపీలో బీజేపీతో పొత్తు ఉన్నామన్న ఒక్క మాట తప్ప.. వేరే ఏ ఇతర కార్యక్రమాల్లోనూ జనసేన, బీజేపీ నేతలు కలిసి ఉన్న సీన్లు కనిపించలేదు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జనసేన పొత్తుపై మరోసారి క్లారిటీ ఇచ్చాక .. ఇక వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసే పనిచేస్తాయన్న సంకేతాలు ఇచ్చినట్లు అయింది. అయితే చంద్రబాబు అరెస్టుతో ఏపీలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.

టీడీపీతో, జనసేనతో బీజేపీ కలిసి వస్తుందని తాను నమ్ముతున్నానన్న పవన్..బీజేపీని ఒక రకంగా ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాడన్న వార్తలు అప్పట్లో గట్టిగా వినిపించాయి. ఢిల్లీ వెళ్లి కాషాయ పెద్దలతో మాట్లాడతానన్న పవన్.. ఆ తర్వాత పెద్దగా ఆ విషయాన్ని పట్టించుకోలేదు. దీనికి పవన్ చేసిన పొత్తుల ప్రకటనపై బీజేపీ అధినాయకత్వం నుంచి కానీ, వేరే ఇతర బీజేపీ నేతలెవరూ స్పందించకపోవడంతోనే పవన్ రెండో ఆలోచనలో పడ్డారన్న వాదన వినిపిస్తుంది. దీంతోనే ఇక 2024 ఎన్నికల్లో టీడీపీతోనే కలిసి పోటీ చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. దీనితోనే ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన ఉందని తెలిసినా..తనను కలవడానికి కూడా ఏ మాత్రం ప్రయత్నించకుండా..అదే సమయంలో నాలుగో విడత తన వారాహి విజయ యాత్రలో బిజీ షెడ్యూల్‌ ప్లాన్ చేసుకున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

మరోవైపు జనసేన పొత్తులపై కృష్ణా జిల్లా అవనిగడ్డలో నిర్వహించిన వారాహి విజయ యాత్ర తర్వాత, ఏపీ బీజేపీ నేతలకు కూడా స్పష్టమైన క్లారిటీ వచ్చేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దాంతో పురంధేశ్వరి నేతృత్వంలో.. ఏపీ బీజేపీ నేతల బృందం త్వరలోనే హస్తినకు వెళ్లి.. కాషాయ పెద్దలతో పొత్తులపై ఓ నిర్ణయానికి వచ్చే ఆలోచన చేస్తోందన్న వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

టీడీపీ, జనసేన కూటమి నుంచి ఓ ఐదారు అసెంబ్లీ సీట్లు, ఒకటో రెండో ఎంపీ సీట్లు..ఆశించడం తప్ప, ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకో ఆప్షన్ లేదని ఏపీ బీజేపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. చంద్రబాబు అరెస్టుతో టీడీపీ శ్రేణులు కొంత డీలా పడినా, జనసేనాని టీడీపీకి భుజం కాయడంతో పవన్ వారాహి యాత్రకు టీడీపీ నేతల సపోర్టు కూడా వచ్చింది. దీంతో వైసీపీ నేతలూ కూడా ఏమాత్రం అంచనా వేయలేని విధంగా జనసేన పార్టీకి ప్రజల్లో మరింత మైలేజీ పెరిగింది.

ఇప్పుడు ఏపీలో రాజకీయ పరిణామాలు చూసుకుంటే.. చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అంతేకాదు ఎప్పుడు బయటకు వస్తారో తెలియని పరిస్థితిలో ఉన్నారు. లోకేష్ ఎప్పుడు, ఎక్కడ అరెస్ట్ అవుతారో తెలియదు. బ్రాహ్మణి టీడీపీ బాధ్యతలు భుజాన వేసుకున్నా రాజకీయాలలో తగిన పరిణితి రావడానికి చాలా సమయం పడుతుంది. ఇక బాలకృష్ణకు రాజకీయాలలో అన్నీ తానై చక్రం తిప్పే ఓపిక, సహనం లేవన్న ముద్రను వేసుకున్నారు. దీంతో ఇప్పుడు టీడీపీకి జనసేనాని తప్ప వేరే గత్యంతరం కనిపించడం లేదు. దీంతో..జనసేన , టీడీపీ కూటమిలో, జనసేన పార్టీనే డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా మారుతోంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు పవన్ డిమాండ్లకు కచ్చితంగా తల ఒగ్గాలి తప్ప.. వేరే మార్గం లేదు. ఇలాంటప్పుడు బీజేపీ కలిసి రాకపోతేనే జనసేనకు లాభమన్న లెక్కల్లో జనసేన ఉంది. బీజేపీని కలుపుకొని పోతే కొన్ని సీట్లయినా దానికి సర్దుబాటు చేయాలి.అందుకే దాదాపు ఏపీలో జనసేనాని బీజేపీని లైట్ తీసుకున్నారన్న వార్తలు రాజకీయ వర్గాలలో చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి ఎన్నికల ముందు చంద్రబాబు అరెస్టును తమకు అనుకూలంగా మార్చుకోవాలన్న వైసీపీ లెక్కలు.. ఇప్పుడు పవన్‌కు అనుకూలంగా మారిపోయాయంటూ ఏపీలో జోరుగా చర్చలు సాగుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =