ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు.. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. గురువారం అమరావతి ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీ అంటే అమరావతి, పోలవరం అని వెల్లడంచారు. వైసీపీ ప్రభుత్వపాలనల అమరావతి రైతులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని వెల్లడంచారు. దాదాపు 1631 రోజులు దీక్ష చేశారని.. రాష్ట్రంలో కటమి ప్రభుత్వం కొలువుదీరాక తమపై నమ్మకంతో దీక్షను విరమించారని వెల్లడించారు. తమపై నమ్మకం ఉంచిన రైతులందరికీ చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలియజేశారు.
ప్రస్తుతం పోలవరాన్ని చూస్తే చాలా బాధేస్తోందని చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే రాష్ట్రం మొత్తానికి నీరు అందుతుందని అన్నారు. అందుకే ఆ ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. కేంద్ర నిధులతో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తే రాష్ట్రంలో సాగునీటి రంగానికి ఇకపై ఎటువంటి ఇబ్బంది ఉండదని అన్నారు. అలాగే రాష్ట్ర ప్రజలు ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే అమరావతి నిర్మాణం చేపట్టామని వివరించారు.
రాజకీయాలకు పనికిరాని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో గత అయిదేళ్లు ప్రత్యక్షంగా చూశామని అన్నారు. ప్రజావేదికను కూల్చి జగన్ పానలనను ప్రారంభించారని వెల్లడించారు. పవిత్ర జలాలు, మట్టి తీసుకొచ్చి ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతం కాబట్టి ఆ మట్టే మనల్ని కాపాడిందని వెల్లడించారు. కొన్ని అల్లరిమూకలు అమరావతిలో ఏర్పాటు చేసిన నమూనాలన ధ్వంసం చేశాయని.. వాటిని కాపాడుకునేందుకు రైతులు ఎంతగాన కష్టపడ్డారని తెలిపారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం గతంలోనే తాము స్పష్టమైన విధానాన్ని ప్రకటించామని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE