ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరినాక రెండోసారి అసెంబ్లీ సమావేశాలు జూలై మూడో వారంలో జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలలకు ఈ సమావేశంలో బడ్జెట్‌న ప్రవేశ పెట్టాల్సి ఉంది. ఇందుకోసం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం సహకారం కోరుతున్నారు. దీనిపై చర్చించేందుకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు అధికారికంగా ప్రధానితో భేటీ కానున్నారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఖరారు అయింది.
త్వరలోనే మోడీ సర్కార్ సెంట్రల్ బడ్జెట్‌ను ప్రవేశబెట్టబోతోంది. ఈ సమయంలో రాష్ట్రానికి సబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలప కేంద్రంతో చర్చించేందుకు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నారు. జూలై 4న ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లతో సమావేశం కానున్నారు. విభజన హామీలపై కూడా వారితో చర్చించనున్నారు. రాష్ట్రానికి ఎలాగైనా కేంద్రం నుంచి నిధులు తీసుకురావడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్తున్నారు. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలపై క్లారిటీ వస్తే దాని ఆధారంగా రాష్ట్ర బడ్జెట్‌కు ఒక రూపం ఇవ్వొచ్చనే అభిప్రాయంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు.
ఏపీలో రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాలే ప్రధాన అంశాలుగా చంద్రబాబు భావిస్తున్నారు. ఈ సందర్భంగా మోడీతో జరిగే భేటీలో పోలవరం పునరావాస ప్యాకేజీపై కూడా చంద్రబాబు చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అలాగే తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల గురించి.. అమరావతిలో కేంద్ర సంస్థల ఏర్పాటు గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ