జనవరి 27 నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర, అనుమతి, భద్రతపై డీజీపీకి వర్ల రామయ్య లేఖ

TDP Leader Varla Ramaiah Writes to AP DGP on Nara Lokesh Yuvagalam Padayatra Permission Security Which Starts on JAN 27,TDP Leader Varla Ramaiah,Writes to AP DGP,Nara Lokesh,Nara Lokesh Yuvagalam Padayatra,Yuvagalam Padayatra,Yuvagalam Padayatra Permission,Yuvagalam Padayatra Security,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy,YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates,AP BJP Party

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనవరి 27వ తేదీ నుంచి ‘యువగళం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా మహాపాదయాత్ర నిర్వహించనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నారా లోకేష్ చేపట్టే యువగళం పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని, తగిన భద్రత కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సోమవారం లేఖ రాశారు.

“నారా లోకేష్ యువగళం పేరిట 2023, జనవరి 27న కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించి ఆంధ్రప్రదేశ్‌లో 400 రోజుల పాటుగా 4000 కిలోమీటర్లు మేర పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. రాష్ట్రంలోని ప్రజలను మరియు ముఖ్యంగా యువతకు చైతన్యం కలిగించడానికి ఈ కార్యక్రమం రూపొందించబడింది. ఈ నేపథ్యంలో పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని, తగిన భద్రత కల్పించాలని కోరుతున్నాం. మేము ట్రాఫిక్ కు మరియు శాంతిభద్రతల నిర్వహణకు ఎటువంటి ఆటంకం కలిగించము. టి.నరేష్ అనే నారా లోకేష్ వ్యక్తిగత స్టాఫ్ మాత్రమే సంప్రదింపుల యొక్క పాయింట్‌ ఆఫ్ కాంటాక్ట్ గా వ్యవహరిస్తారు మరియు పాదయాత్ర అంతటా మీకు అవసరమైన సమాచారాన్ని అందజేస్తారు” అని లేఖలో పేర్కొన్నారు.

“అంతకుముందు, ఈ మధ్య కాలంలో కూడా నారా లోకేష్‌కి రాజకీయ ప్రత్యర్థులు, సంఘ విద్రోహ శక్తులు, ఫ్యాక్షనిస్టులు నుంచి ప్రాణహాని సవాళ్లు ఎదురయ్యాయి. చెప్పబడిన భయాందోళన పరిస్థితుల దృష్ట్యా పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్‌కి తగిన భద్రతా ఏర్పాట్లు చేయవలసిందిగా కోరుతున్నాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పాదయాత్ర అంతటా మరియు నైట్ హాల్ట్ వేదికల వద్ద అవసరమైన భద్రతా ఏర్పాట్లను అందించాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. ఇంకా పాదయాత్రకు తగిన భద్రత కల్పించేలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాం. మీకు సమాచారం ఇచ్చేందుకు మరియు అవసరమైన చర్యల కోసం లేఖ రాస్తున్నాం” అని డీజీపీకి రాసిన లేఖలో వర్ల రామయ్య పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 9 =