కర్నూల్ విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరుపెట్టడంపై చిరంజీవి స్పందన

Chiranjeevi expresses joy over naming Orvakal Airport, Chiranjeevi over Naming Kurnool Airport as Uyyalawada Narasimha Reddy Airport, Chiranjeevi Overjoyed CM Jagan Names Uyyalawada, Chiranjeevi Responds over CM Jagan Naming Kurnool Airport as Uyyalawada Narasimha Reddy Airport, CM Jagan inaugurates Kurnool airport, CM Jagan names Kurnool Airport after Uyyalawada, CM Jagan Naming Kurnool Airport as Uyyalawada Narasimha Reddy Airport, CM Jagan opens Kurnool Airport, Kurnool Airport as Uyyalawada Narasimha Reddy, Kurnool Airport as Uyyalawada Narasimha Reddy Airport, Kurnool Airport Name Changed as Uyyalawada Narasimha, Mango News, Uyyalawada Narasimha Reddy Airport

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నిర్మించిన ఎయిర్‌పోర్టును ప్రారంభించారు. అనంతరం అక్కడ జరిగిన సభలో ప్రసంగిస్తూ, కర్నూల్ గడ్డకు చెందిన స్వాతంత్య్ర యోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి పేరును ఈ ఎయిర్‌పోర్టుకు పెడుతున్నట్టుగా సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రకటనపై ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. కర్నూల్ ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

“భారతదేశపు మొట్టమొదటి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును కర్నూల్ ఎయిర్‌పోర్టుకు పెడుతున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ఆనందాన్ని కల్గించింది. గొప్ప దేశభక్తుడు, నిజమైన యోధుడుకు దక్కిన గౌరవం ఇది. అలాంటి గొప్ప వ్యక్తి పాత్రను తెరపై పోషించే అవకాశం లభించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను” అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ