ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్ కడప జిల్లాలో శ్రీరామ నవమి సందర్భంగా ఆంధ్ర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన వొంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయ వార్షిక (శ్రీరామనవమి) బ్రహ్మోత్సవాలు మార్చి 30న ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 9 వరకు జరగనుండగా.. ఈ క్రమంలో రేపు (ఏప్రిల్ 5న) రాత్రి 8 నుండి 10 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణం నిర్వహించనున్నారు. కాగా ఈ వేడుకలను పది రోజుల పాటు నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాట్లు చేసింది. వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రీరామ నవమి సందర్భంగా గురువారం ‘అంకురార్పణం’ కార్యక్రమంతో ప్రారంభమై ఏప్రిల్ 9న ‘పుష్పయాగం’తో ముగుస్తాయి.
ఈ నేపథ్యంలో సీతారామ కల్యాణ మహోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. రేపు జరిగే సీతారామ కల్యాణంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు సీఎం జగన్. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇక ఈ వేడుకలను దాదాపు 2 లక్షల మంది భక్తులు కల్యాణాన్ని తిలకించే అవకాశం ఉందని, ఈ కల్యాణాన్ని ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ, ఆలయ అధికారులు, కడప జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తుల కోసం మరుగుదొడ్లు, తాగునీటి కియోస్క్‌లు, అన్నప్రసాదం కౌంటర్లు, తాత్కాలిక వైద్య శిబిరాలు, ఆరోగ్య, వైద్య సిబ్బందితో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE