రేపటి నుంచి జిల్లాల పర్యటనకు టీడీపీ అధినేత చంద్రబాబు.. ఈనెల 13న గుడివాడలో బహిరంగ సభకు హాజరు

TDP Chief Chandrababu Naidu To Visit Several Districts Across AP From Tomorrow,TDP Chief Chandrababu Naidu,Chandrababu Naidu To Visit Several Districts Across AP,TDP Chief To Visit Districts Across AP From Tomorrow,Mango News,Mango News Telugu,TDP Party,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates,Andhra pradesh Politics,Chandrababu Naidu Latest News,Chandrababu Naidu Latest Updates,Chandrababu Naidu Live News

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపటినుంచి రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల పర్యటన చేయనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన ఈ వారంతో పాటు వచ్చే వారం విస్తృతంగా పలు జిల్లాలలో పర్యటించనున్నారు. టీడీపీ వర్గాలు పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈ నెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకూ చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మూడు చోట్ల జోనల్‌ సదస్సుల్లో పాల్గొననున్నారు. ఏప్రిల్ 5వ తేదీన విశాఖపట్నం, 6వ తేదీన కడప మరియు 7వ తేదీన నెల్లూరు జిల్లాలకు ఆయన వెళ్లనున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న వివిధ కార్యక్రమాలు మరియు సదస్సుల్లో పాల్గొంటారు. ఇక ఒకో సదస్సులో 35 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలు పాల్గొంటారని సమాచారం.

అలాగే దీని తర్వాత ఏప్రిల్ 11న అమరావతిలో జరిగే ఇఫ్తార్‌ విందు కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం మైనారిటీల కోసం ఈ కార్యక్రమాన్ని టీడీపీ కేంద్ర కార్యాలయం సమీపంలోని సీకే కల్యాణ మండపంలో నిర్వహిస్తున్నారు. ఇక ఏప్రిల్ 12 నుంచి మూడు రోజులపాటు ఆయన కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఈనెల 13న గుడివాడలో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొననున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అనూహ్యంగా నాలుగు స్థానాలు (మూడు పట్టభద్రల స్థానాలు, 1 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ) దక్కించుకోవడంతో రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఫలితాలు టీడీపీలో కొత్త జోష్ నింపాయి. ఈ నేపథ్యంలో.. పార్టీ అధినేత చంద్రబాబు ఇదే ఊపును కొనసాగించేలా వివిధ కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువయ్యేలా పర్యటనలు చేయనుండటం ఆ పార్టీకి కలిసి వస్తుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + sixteen =