ఆంధ్రప్రదేశ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

71st Republic Day, 71st Republic Day Celebrations, 71st Republic Day Celebrations In Andhra Pradesh, Andhra Pradesh Latest News, AP Breaking News, Ap Political Live Updates, Ap Political News, latest political breaking news, Mango News Telugu, Republic Day 2020
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. గణతంత్ర వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, రాష్ట్ర మంత్రులు,  వివిధ శాఖల ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు. వేడుకల సందర్భంగా జరిగిన పరేడ్ లో ఈ సంవత్సరం తెలంగాణ పోలీసులు పాల్గొన్నారు. అలాగే వేడుకల్లో రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ రంగాలపై  ప్రదర్శించిన 14 శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 1 =