గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌ వెబ్‌సైట్స్ నిషేదించాలని కోరుతూ సీఎం వైఎస్ జగన్ లేఖ

AP CM YS Jagan, AP CM YS Jagan wrote a letter to Union Minister, Block Online Gambling Sites, Block online gaming sites in AP, CM Jagan Wrote a Letter to Union IT Minister, ISPs To Block Online Gambling Sites, Jagan ISPs To Block Online Gambling Sites, Jagan Mohan Reddy wants betting apps, Online Gambling Sites, YS Jagan To Block Online Gambling Sites

ఆన్‌లైన్‌ గేమింగ్, గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌ వెబ్‌సైట్లు నిషేదించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి కేంద్ర లా అండ్ జస్టిస్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ కు లేఖ రాశారు. రాష్ట్రంలో ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌ కు పాల్పడే మొత్తం 132 వెబ్‌సైట్లు/యాప్ లను బ్లాక్‌ చేసేలా ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లను ఆదేశించాలని లేఖలో కేంద్రమంత్రిని సీఎం వైఎస్ జగన్ కోరారు. ఆన్‌లైన్ లో బెట్టింగ్ కు యువత సులభంగా అలవాటు పడుతున్నారని, డబ్బులు పోగొట్టుకుని బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ లను నేరంగా పేర్కొంటూ ఏపీ గేమింగ్‌ చట్టం‌–1974లో సవరణలు తీసుకొచ్చామని చెప్పారు. అలాగే నిషేదించాలని నిర్ణయించిన 132 వెబ్‌సైట్ల వివరాలను కూడా కేంద్రమంత్రికి రాసిన లేఖకు జత చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu