కడపలో వైఎస్ఆర్ మెగా ఇండస్ట్రియల్ హబ్ ప్రారంభించిన సీఎం జగన్

2 industrial hubs inaugurated in Kadapa, Andhra CM YS Jagan Mohan Reddy, AP CM To Tour Kadapa District, AP CM YS Jagan, AP CM YS Jagan To Tour in Kadapa District, AP CM YS Jagan will Tour in Kadapa District, Ap Political News, CM YS Jagan, CM YS Jagan Inaugurates YSR Mega Industrial Hub In Kadapa, Jagan to tour Kadapa, Kadapa, Mango News, YS Jagan Inaugurates YSR Mega Industrial Hub In Kadapa, YS Jagan Mohan Reddy To Visit Kadapa, YS Jagan to tour Kadapa district, YS Jagan Tour in Kadapa District, YSR, YSR Mega Industrial Hub, YSR Mega Industrial Hub In Kadapa

కడప జిల్లాలో వైఎస్ఆర్ మెగా ఇండస్ట్రియల్ హబ్ ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్. కొప్పర్తి పారిశ్రామిక వాడలో పర్యటించిన జగన్.. ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ను కూడా ప్రారంభించారు. డిక్సన్ పరిశ్రమ కోసం కేటాయించిన నాలుగు షెడ్లను ప్రారంభించారు. దీంతోపాటు మరో 18 చిన్న పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత పారిశ్రామిక వేత్తలతో ముచ్చటించిన సీఎం వారికి పలు హామీలిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు.

“ఇప్పటికే రాష్ట్రంలో డిక్సన్ కంపెనీ ఏర్పాటైంది. ఏప్రిల్ నాటికి శిక్షణ పూర్తి చేసుకున్న 1800 మందికి పరిశ్రమలో ఉపాధి లభిస్తుంది. మరో ఆరు సంస్థల ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. మరి కొన్ని నెలల్లో కొత్త సంస్థల్లో ఇంకో 7500 మందికి ఉపాధి లభిస్తుంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులకు వీవీడీఎన్ ముందుకొచ్చింది. ఇక్కడి హబ్ లో మరో 15 ఎంఎస్ఎంఈలకు శంకుస్థాపన జరిగింది. వీటి వలన మరో 1200 మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ పారిశ్రామిక వాడలతో రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది” అని సీఎం జగన్ ఉపన్యసించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − eleven =