ఏపీలో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్, మార్చ్ 14 న కౌంటింగ్

AP Municipal Elections Polling Completed Peacefully, Counting on March 14th

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. అక్కడక్కడా చెదురుముదురు ఘటనలు మినహా మొత్తం 12 కార్పొరేషన్లకు మరియు 13 జిల్లాల్లోని 71 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. కాగా మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 53.57% పోలింగ్ ‌నమోదయింది. ఉదయం నుంచే ప్రజలు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని ఓట్లు వేశారు. పూర్తి పోలింగ్ శాతం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ముందుగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల అవగా 4 మున్సిపాలిటీలు ఏకగ్రీవం అయ్యాయి. వైఎస్ఆర్ కడప‌ జిల్లాలోని పులివెందుల, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల, మాచర్ల మున్సిపాలిటీల్లో అన్ని వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో ఈ రోజు 71 మున్సిపాలిటీల్లో పోలింగ్ నిర్వహించారు. ఇక మార్చి 14 వ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − fourteen =