మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం వైఎస్ జగన్‌

CM YS Jagan Consoled the Family Members of Minister Perni Nani at Machilipatnam Today

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ‌మోహన్ ‌రెడ్డి శనివారం మధ్యాహ్నం మచిలీపట్నం వెళ్లి రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రి పేర్ని నాని మాతృమూర్తి నాగేశ్వరమ్మ అనారోగ్యంతో బాధపడుతూ గత గురువారం నాడు కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ఈ రోజు మచిలీపట్నంలోని మంత్రి నివాసానికి వెళ్లి, విషాదంలో ఉన్నపేర్ని నాని కుటుంబ సభ్యులను ఓదార్చారు. మంత్రి పేర్నినానిని పరామర్శించిన వారిలో సీఎం వైఎస్ జగన్ తో పాటుగా రాష్ట్ర మంత్రులు కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే జోగి రమేష్, పలువురు పార్టీ నాయకులు ఉన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ