జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు టిఆర్‌ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇదే…

Campaigning For GHMC Elections, GHMC Elections, GHMC Elections 2020, GHMC Elections Campaigning, GHMC Elections Latest News, GHMC Elections News, GHMC Elections Updates, GHMC Nominations, Greater Hyderabad Municipal Corporation, Mango News, TRS Party Releases Star Campaigners List, TRS Star Campaigners List, TRS Star Campaigners List for GHMC Elections

హైదరాబాద్ నగరంలో ఎన్నికల సందడి మొదలైంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు నామినేషన్స్ పక్రియ ముగియడంతో ప్రధాన పార్టీలైన టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రచార పర్వంపై దృష్టి పెట్టాయి. ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ నేటి నుంచి ప్రచార కార్యక్రమాన్నిపెద్దఎత్తున చేపడుతుంది. మొత్తం 150 డివిజన్లలో టిఆర్ఎస్ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇప్పటికే మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఎలక్షన్ ఇంచార్జులుగా బాధ్యతలు కూడా అప్పగించారు. బల్దియా పీఠంపై మరోసారి గులాబీ జెండా ఎగరేసేందుకు నాయకులు ఉత్సాహంగా ప్రచార పర్వంలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి స్టార్ క్యాంపెయినర్ల జాబితాను టిఆర్ఎస్ పార్టీ విడుదల చేసింది. టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సహా మొత్తం 10 మందికి ఆ జాబితాలో చోటు కల్పించారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు టిఆర్‌ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితా:

  1. టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు
  2. టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్
  3. మంత్రి మహమూద్ అలీ
  4. మంత్రి హరీష్ రావు
  5. మంత్రి ఈటల రాజేందర్
  6. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
  7. మంత్రి కొప్పుల ఈశ్వర్
  8. మంత్రి సత్యవతి రాథోడ్
  9. మంత్రి సబితా ఇంద్రారెడ్డి
  10. మంత్రి పువ్వాడ అజయ్

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − seven =