ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి నియోజకవర్గంలో ఒక ‘జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ లే అవుట్’ ఏర్పాటు చేయాలని ఆదేశించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. శుక్రవారం ఆయన ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు ఆయన అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ఇక తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ సమీర్ శర్మ, స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, ఏపీ టిడ్కో ఎండీ శ్రీధర్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.
సీఎం జగన్ కీలక ఆదేశాలు..
- వర్షాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించాలి.
- దెబ్బతిన్న రోడ్లను గుర్తించి వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మరమ్మతులు పూర్తి చేయాలి.
- అలాగే ప్రతీ మున్సిపాలిటీ పరిధిలో వేస్ట్ ప్రాసెసింగ్ ప్రక్రియ అమలవుతున్న తీరుని నిరంతరం పర్యవేక్షించాలి.
- కృష్ణా నది వరద ముంపుని నివారించడానికి యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేసిన రిటైనింగ్ వాల్ నిర్మాణం వద్ద డ్రైనేజీ వాటర్ చేరకుండా చర్యలు చేపట్టాలి.
- రాష్ట్రంలో ప్లాస్టిక్ బ్యానర్లు, ఫ్లెక్సీలు నిషేధించిన నేపథ్యంలో ఆయా వ్యాపారులను క్లాత్ బ్యానర్ల తయారీకి ప్రోత్సహించేలా జిల్లాల కలెక్టర్లు చొరవ చూపాలి.
- ఇక జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు, మురుగునీటి శుద్ధి కేంద్రాలు త్వరితగతిన ఏర్పాటు చేయాలి.
- ప్రతి నియోజకవర్గంలో ఒక జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ లే అవుట్‌ను ఏర్పాటు చేయాలి.
- విజయవాడ నుంచి గన్నవరం విమానాశ్రయం వెళ్లే రహదారికి ఇరువైపులా, అంబేడ్కర్ పార్కుకి వెళ్లే రోడ్లతో పాటు విశాఖపట్నంలోని రోడ్ల సుందరీకరణను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలి.
- వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ప్రతి ఏటా 45 ఏళ్ళు నిండిన మహిళలకు అందిస్తున్న ఆర్ధిక సాయంతో వారు స్వయం ఉపాధి సృష్టించుకోవడానికి తగిన సలహాలు, సూచనలు అందించాలి.
- ఈ అంశాలన్నింటిపై జిల్లాల వారీగా ఎప్పటికప్పుడు కలెక్టర్లతో సమీక్షలు చేసి పనుల పురోగతిపై వివరాలు తెలుసుకోవాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY