ఎస్పీ బాలసుబ్రమణ్యం కు కరోనా నెగటివ్

COVID-19, Singer SP Balasubrahmanyam, SP Balasubrahmanyam, SP Balasubrahmanyam Health, sp balasubrahmanyam health condition, sp balasubrahmanyam health update, SP Balasubrahmanyam Tests Negative, SP Balasubrahmanyam Tests Negative for Covid-19

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో గత కొన్ని రోజులుగా చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఫలితం నెగెటివ్‌ వచ్చినట్లు ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌ ఈ రోజు ఓ వీడియో ద్వారా వెల్లడించారు. ‘నాన్నకు కరోనా నెగిటివ్‌గా వచ్చింది. కాకపోతే ఆయన ఊపిరితిత్తుల్లో ఇంకా ఇన్‌ఫెక్షన్‌ ఉండటంతో కొన్ని రోజుల తర్వాత వెంటిలేటర్‌ తొలగించాలని వైద్యులు భావిస్తున్నారు. ఆయనకు ప్రస్తుతం ఫిజియోథెరపీ కొనసాగుతోంది. నాన్న స్పృహలోనే ఉన్నారు. ఆయన కోసం ప్రార్థనలు చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ఈ ప్రార్థనలు ఇలాగే కొనసాగాలి” అని ఎస్పీ చరణ్‌ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here