బిల్లు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి, ఏపీలో అన్ని జిల్లాల్లో అమలు

AP Aarogyasri Scheme, AP Aarogyasri Scheme News, AP Aarogyasri Scheme Updates, AP CM YS Jagan, AP Implementation of YSR Aarogyasri Scheme, CM YS Jagan, CM YS Jagan Launched Implementation of YSR Aarogyasri Scheme, Implementation of YSR Aarogyasri Scheme, Implementation of YSR Aarogyasri Scheme in All 13 Districts, Implementation of YSR Aarogyasri Scheme In AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసుపత్రి బిల్లు 1000 రూపాయలు దాటితే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య చికిత్స అందించే కార్యక్రమాన్ని మిగిలిన జిలాల్లో కూడా మంగళవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి ప్రారంభించారు. ఆరోగ్య శ్రీ విస్తరణ సేవల్లో భాగంగా వైద్యం ఖర్చు రూ.1000 దాటిన దగ్గర నుంచి ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా, గత జనవరిలో ముందుగా పశ్చిమ గోదావరి జిల్లాలో ‘వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పైలట్‌ ప్రాజెక్టు’ ను ప్రారంభించారు. అనంతరం జూలై 16 నుంచి పశ్చిమ గోదావరి జిల్లాతో సహా విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు జిల్లాలో కూడా అమలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో మిగిలిన ఆరు జిల్లాలైన శ్రీకాకుళం, తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, అనంతపురంలలో ఈ పథకాన్ని ఈ రోజు సీఎం వైఎస్‌ జగన్ అధికారికంగా ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ పథకంలో గతంలో 1,059 వ్యాధులకు చికిత్స అందిస్తుండగా, ప్రస్తుతం క్యాన్సర్ తో సహా 2,434 వైద్య ప్రక్రియలకు ఉచితంగా చికిత్సలు వర్తించే విధంగా మార్పులు చేశారు. ఈ పథకం నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ